logo

పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు వినతి

సంక్రాంతి సెలవుల పొడగింపుతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం(ట్రస్మా) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణారావు ఆరోపించారు. ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

Published : 18 Jan 2022 02:34 IST

సమావేశంలో యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణారావు, ప్రతినిధులు

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సంక్రాంతి సెలవుల పొడగింపుతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం(ట్రస్మా) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణారావు ఆరోపించారు. ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కొవిడ్‌ వ్యాప్తి చెందుతుందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో సభలు, సమావేశాలు, శుభకార్యాలకు లేని ఆంక్షలు పాఠశాలలకు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు అల్లంకి శ్రీనివాస్‌, శ్రీధర్‌, ఫజల్‌ ఆహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిచెందుతుందనే కారణంతో విద్యాసంస్థలకు సెలవులు పొడగించడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సీపెల్లి రవీందర్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణతో పెద్దగా ప్రయోజనంలేదన్నారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సర ఫలితాలే దీనికి నిదర్శనమన్నారు. కొవిడ్‌ నిబంధనలతో విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన నిర్వహించాలని సూచించారు. ఎక్కువ మంది ఉన్నచోట ఉదయం, సాయంత్రం వేళల్లో బోధన చేపట్టాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలన్నారు.

సెంటినరీకాలనీ: పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు అనుమతిని ఇవ్వాలని ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.కేశవరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సెంటినరీకాలనీలో ఏర్పాటు చేసిన ప్రైవేటు పాఠశాలల నిర్వాహకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సెలవుల ప్రకటనను విరమించుకొని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు అనిల్‌రెడ్డి, కుమార్‌, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని