logo

అంజన్న క్షేత్రం భక్తజన సంద్రం

కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రం మంగళవారం భక్తజన సంద్రంగా మారింది. సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న కొద్ది ప్రతి శని, మంగళవారాల్లో వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న,

Published : 19 Jan 2022 02:22 IST

ఆలయం ముందు భక్తుల రద్దీ

మల్యాల, న్యూస్‌టుడే : కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రం మంగళవారం భక్తజన సంద్రంగా మారింది. సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న కొద్ది ప్రతి శని, మంగళవారాల్లో వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ధర్మపురి నరసింహస్వామిని దర్శించుకొని సమ్మక్క జాతరకు వెళ్లడం ఆనవాయితీ. దీంతో వేకువజామునే అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని బారులు తీరారు. దాదాపు 50 వేలకుపైగా భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శించుకొని వెళ్లారని ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా రెండు ప్రసాదం కౌంటర్లు తెరిచారు. కొండపైన బస్టాండు ముందుగల ఖాళీ స్థలం భక్తుల వాహనాలతో కిక్కిరిపోయింది. ఆలయ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

బస్టాండు ముందు ఖాళీ స్థలంలో నిలిపిన భక్తుల వాహనాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని