logo

46 మందికి కరోనా

కరీంనగర్‌ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం మంగళవారం వెలువరించిన బులెటిన్‌లో 46 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. రెండో దశ కరోనా సమయంలో

Published : 19 Jan 2022 02:22 IST

ముగ్గురు గర్భిణులకు పాజిటివ్‌

కరోనా బాధితులకు సిద్ధంగా ఉన్న వార్డు

కరీంనగర్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం మంగళవారం వెలువరించిన బులెటిన్‌లో 46 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. రెండో దశ కరోనా సమయంలో కిటకిటలాడిన కరీంనగర్‌ ఆసుపత్రిలో మంగళవారం నాటికి కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే కొవిడ్‌ చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పిల్లల కోసం కూడా ప్రత్యేక ఐసీయూ కేంద్రం అందుబాటులో ఉంచారు. నాలుగు రోజుల నుంచి 21 నుంచి 24 వరకు కేసులు నమోదైనట్లు ప్రభుత్వ బులెటిన్‌లో పేర్కొన్నారు. కొవిడ్‌ బారిన పడ్డవారిలో అత్యధికులు హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఉన్నవారి పరిస్థితి కూడా బాగానే ఉన్నట్లు వైద్యులు వివరించారు.

* పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన గర్భిణలకు కరోనా సోకడంతో వారిద్దరిని ప్రసవం కోసం కరీంనగర్‌ మాతా శిశు కేంద్రానికి పంపించారు. వారిలో ఒకరికి ఐదు రోజుల క్రితం మరొకరికి రెండ్రోజుల క్రితం శస్త్ర చికిత్సలు చేసి ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కరీంనగర్‌లోని ఒక ప్రాంతానికి చెందిన ఎనిమిది నెలల గర్భిణికి పాజిటివ్‌ రాగా ఆమె హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతోంది.

పిల్లల కోసం ప్రత్యేక ఐసీయూ
ఇప్పటికే పెద్దవారి కోసం 95 పడకల ఐసీయూ కేంద్రం ఉంది. పిల్లల కోసం కూడా 42 పడకలతో ప్రత్యేక ఐసీయూవార్డు అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అనుమానితులకు వైద్యం అందించేందుకు 28 పడకలతో సారి వార్డు కూడా ఉంది. కరోనాతో చికిత్స కోసం వచ్చే వారికి సౌకర్యాలు కల్పించినట్లు ఆస్పత్రి ఆర్‌ఎంఓ జ్యోతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని