logo

జ్వరాలపై ఇంటింటి సర్వే: కలెక్టర్‌ రవి

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా జ్వరాలపై ఇంటింటి సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి ఆదేశించారు. మంగళవారం శిబిర కార్యాలయం నుంచి జిల్లాలోని వైద్యాధికారులతో జూమ్‌ సమీక్ష

Published : 19 Jan 2022 02:22 IST

జూమ్‌ సమీక్షలో కలెక్టర్‌

జగిత్యాల, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా జ్వరాలపై ఇంటింటి సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి ఆదేశించారు. మంగళవారం శిబిర కార్యాలయం నుంచి జిల్లాలోని వైద్యాధికారులతో జూమ్‌ సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పకడ్బందీగా సర్వే నిర్వహించాలని అనుమానితులకు రాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్‌గా తేలితే గృహ సంరక్షణలో ఉంచే విధంగా చూడాలన్నారు. జిల్లాలో ప్రతిరోజు కనీసం 4 వేల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని పాజిటివ్‌ వచ్చిన వారందరికి చికిత్స ఇవ్వడంతో పాటు కొవిడ్‌ కంట్రోల్‌రూం ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, పడకలు, వెంటిలెటర్లు అందుబాటులో ఉంచుకోవాలని కొవిడ్‌ విజృంభన దృష్టిలో ఉంచుకుని ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతించరాదని కొవిడ్‌ నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

టీకాపై ప్రత్యేక శ్రద్ధ
జిల్లాలో కొవిడ్‌ టీకాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి ఆదేశించారు. సాయంత్రం కలెక్టరేట్‌ నుంచి ప్రత్యేకాధికారులు ప్రొగ్రాం అధికారులతో జూమ్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొదటిడోసు టీకా వందశాతం, రెండోడోసు 75 శాతం పూర్తయిందని ఈనెల 26లోపు వందశాతం లక్ష్యం నెరవేర్చాలన్నారు. టీనెజర్లకు 45 శాతం టీకా ఇచ్చారని మిగతా అర్హులైన వారందరికి వెంటనే ఇవ్వాలన్నారు. బూస్టర్‌డోసుపై శ్రద్ధ తీసుకోవాలని అర్హులైన ప్రతిఒక్కరికి టీకా ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని