logo

ఆరోగ్య ఉప కేంద్రాలు.. ఇక పల్లె దవాఖానాలు

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలన్నీంటిని ప్రభుత్వం పల్లె దవాఖానాలుగా మార్చి గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించారు. పల్లె

Published : 19 Jan 2022 02:22 IST

వైద్యుల నియామకానికి నేడు కౌన్సెలింగ్‌
న్యూస్‌టుడే, కరీంనగర్‌ వైద్య విభాగం

దుర్శేడ్‌లోని ఆరోగ్య ఉపకేంద్రం

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలన్నీంటిని ప్రభుత్వం పల్లె దవాఖానాలుగా మార్చి గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించారు. పల్లె ఆసుపత్రులలో వైద్యులను నియమించేందుకు బుధవారం కరీంనగర్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతాయి.

ఆరు నెలల కిందటే..
ప్రస్తుతమున్న ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు తోడుగా పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసే ప్రక్రియ ఆరు నెలల కిందట ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యత ఏఎన్‌ఎంలు చేపడుతారు. ఇక్కడ తాత్కాలిక వైద్యం అందుతోంది. అవసరమైన వారిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్తారు. పిల్లలకు టీకా మందులతో పాటు కొవిడ్‌ వ్యాక్సిన్‌ కూడా ఇస్తున్నారు. వీటినే పల్లె దవాఖానాలుగా విస్తరించి వైద్యం అందుబాటులో ఉండేలా చూస్తారు. ఆరు నెలల కిందటే జిల్లాలోని మొదటి దశలో 18 ఉప కేంద్రాలను గుర్తించి పల్లె దవాఖానాలుగా మార్చారు. వైద్యుడు, ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది ఉంటారు. వైద్యుడు, ఇతర సిబ్బందిని కాంట్రాక్ట్‌ విధానంలో నియమకాలు చేస్తున్నారు. రెగ్యులర్‌ ఏఎన్‌ఎం ఉంటారు. మొదట గుర్తించిన వాటిలో ప్రస్తుతం ఏడుగురు వైద్యులు సేవలు అందిస్తున్నారు.

తాజాగా 46 దరఖాస్తులు
మొదటి దశలోని 18 ఆసుపత్రులతో పాటు మరో 46 ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానాలుగా గుర్తించారు. వీటిలో వైద్యం అందించేందుకు నియామకాలు చేపట్టారు. 46 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా వారందరికీ బుధవారం క్సౌలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తారు. పోస్టింగ్‌ పొందిన వారు పల్లె దవాఖానాల్లో వైద్యులుగా పని చేయాల్సి ఉంటుంది. ఇక పట్టణ కేంద్రాలలో కూడా బస్తీ దవాఖానాల కోసం ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ జువేరియా తెలిపారు. వీటన్నింటికీ సొంత భవనాలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని