logo

రాజన్న భక్తులకు ఆన్‌లైన్‌లో వసతి సౌకర్యం

దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు వసతి గదులను ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునే సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా మారింది. ఉన్న వసతి గదుల్లో 30 శాతం ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకునేందుకు

Published : 19 Jan 2022 02:22 IST

ప్రతి కాంప్లెక్స్‌లో 30 శాతం గదుల కేటాయింపు
న్యూస్‌టుడే, వేములవాడ గ్రామీణం

భీమేశ్వర సదన్‌ వసతి గదులు

క్షిణకాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు వసతి గదులను ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునే సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా మారింది. ఉన్న వసతి గదుల్లో 30 శాతం ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకునేందుకు ఆలయ అధికారులు అవకాశం కల్పించారు. రాజన్న దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇలాంటి సందర్భంలో వసతి గదులు బుకింగ్‌ చేసుకోకుండా వచ్చే వారికి శుక్ర, ఆది, సోమవారాల్లో గదులు లభించడం గగనమవుతుంది. చాలా మంది ఆరుబయట, చెట్ల కింద సేదతీరాల్సిన పరిస్థితి ఉంటుంది. కొందరు ప్రయివేటు వసతి గదులను ఆశ్రయిస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఐదు రోజులు ముందుగానే బుకింగ్‌ చేసుకునే వెసులు బాటు కల్పించడం భక్తులకు వరంగా మారింది.

రసీదు ఇస్తే...
రాజన్న ఆలయ వసతి కాంప్లెక్స్‌ల్లో 30 శాతం గదులు ఆన్‌లైన్‌లో భక్తులు బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. భక్తులు తమ మొబైల్‌ ఫోన్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌లో టీయాప్‌ ఫోలియో అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వసతి గదులు బుక్‌ చేసుకునే  అవకాశం ఉంది. దీంతో పాటు ఎస్‌ఎస్‌ మీ సేవలోనూ అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో గదుల అద్దె వివరాలు పొందుపరిచారు. వేములవాడకు చేరుకోగానే బుకింగ్‌ చేసుకున్న వసతి గదుల కాంప్లెక్స్‌ దగ్గరికి వెళ్లి బుకింగ్‌ రసీదు ఇస్తే  ఆయా వసతి గదుల కౌంటర్లలోని సిబ్బంది గదిని అప్పగిస్తారు. 24 గంటలు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.

ఉపయోగకరంగా ఉంటుంది
- ప్రతాప నవీన్‌, ఏఈవో, రాజన్న ఆలయం

ప్రస్తుతం ఆలయ వసతి గదులను భక్తుల సౌకర్యం కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునేందుకు కేటాయించాం. ప్రతి కాంప్లెక్స్‌లో ఉన్న వసతి గదుల్లో 30 శాతం గదులు భక్తులు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునేందుకు కేటాయించాం. దూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే వారు ముందుగా బుకింగ్‌ చేసుకొని ఆ రోజు వచ్చి వసతి గదుల్లో బస చేయవచ్చు. ఈ సౌకర్యం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని