logo

బైక్‌ను ఢీకొన్న ఆటో : యువకుడి దుర్మరణం

పట్టణంలోని బీ-కార్నర్‌ రాజీవ్‌ రహదారి మూలమలుపు వద్ద మంగళవారం ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఆటో ఢీకొన్న సంఘటనలో మహబూబ్‌బస్తీకి చెందిన షేక్‌ ఖాజా అజరోద్దీన్‌(25) దుర్మరణం చెందాడు.

Published : 19 Jan 2022 02:22 IST

రామగుండం : పట్టణంలోని బీ-కార్నర్‌ రాజీవ్‌ రహదారి మూలమలుపు వద్ద మంగళవారం ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఆటో ఢీకొన్న సంఘటనలో మహబూబ్‌బస్తీకి చెందిన షేక్‌ ఖాజా అజరోద్దీన్‌(25) దుర్మరణం చెందాడు. ఎన్టీపీసీలోని ఓ ప్రైవేటు కంపెనీ దుకాణంలో కారు మెకానిక్‌గా పనిచేస్తున్న అజరోద్దీన్‌ రోజులాగే బైక్‌పై ఎన్టీపీసీకి విధులకు వెళ్తున్నాడు. బీ-కార్నర్‌ వద్ద పెద్దపల్లి నుంచి రామగుండం వైపు వేగంగా వస్తున్న ఆటో ట్రాలీ బైక్‌ను ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై అజరోద్దీన్‌ అక్కడికక్కడే మరణించాడు. అజరోద్దీన్‌ అవివాహితుడు. పెద్దపల్లికి చెందిన ఆటోట్రాలీ డ్రైవర్‌ రూబీబ్‌ఖాన్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తెలిపారు. అజరోద్దీన్‌ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ  జెన్‌కో బీ-థర్మల్‌ విద్యుత్తు కేంద్రం ఎదుట కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మక్కన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఆధ్వర్యంలో కుటుంబసభ్యులు, బంధువులు ధర్నా చేపట్టారు. ప్లాంటు కోల్‌మిల్స్‌ గేర్‌షాఫ్ట్‌ పాడవడంతో పెద్దపల్లిలో బాగు చేసుకొని ఆటో ట్రాలీలో సామగ్రి తెస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని జెన్‌కో అధికారులను మక్కన్‌సింగ్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని