logo

హరిత లక్ష్యంపై ప్రణాళిక: కలెక్టర్‌ రవి

జిల్లాలో హరితహారం ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం హరితలక్ష్యంపై బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి

Published : 20 Jan 2022 02:27 IST

సమీక్ష సమావేశంలో కలెక్టర్‌

జగిత్యాల, న్యూస్‌టుడే : జిల్లాలో హరితహారం ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం హరితలక్ష్యంపై బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గత సెప్టెంబర్‌లో 2022 సంవత్సరానికి 40.88 లక్షల మొక్కల నాటేందుకు ప్రణాళిక రూపొందించామని 2023-24 సంవత్సరానికి మొక్కల లక్ష్యాలపై ప్రణాళిక సిద్ధం చేసి గురువారం సాయంత్రంలోగా అటవీశాఖ అధికారులకు సమర్పించాలన్నారు. జిల్లాలో ఎక్కువ కాలం బతికే మొక్కలు, బయోఫెన్సింగ్‌, మెడిసినల్‌ ప్లాంట్స్‌ పెంపకానికి ప్రాధాన్యతనివ్వాలని వచ్చే రెండు సంవత్సరాల కోసం గత లక్ష్యానికంటే పదిశాతం ఎక్కువగా పెంచేవిధంగా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ అన్నారు. సమావేశంలో ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్‌ టి.వినోద్‌కుమార్‌, డీఎఫ్‌ఓ వి.వెంకటేశ్వర్‌రావు, జడ్పీ సీఈవో సుందరవరదరాజన్‌, డీఆర్డీవో వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని