logo

స్వచ్ఛతలో పోటీ.. కొవిడ్‌ నిబంధనలు వదిలేసి

మెట్‌పల్లి బల్దియా పరిధిలో తడి, పొడి చెత్తను వేరుచేసి బల్దియా ఆటోలకు అందించి స్వచ్ఛసర్వేక్షణ్‌లో ప్రజలు పాలుపంచుకోవాలంటూ నిత్యం బల్దియా అధికారులు వీధివీధినా విస్తృత ప్రచారం చేస్తున్నారు.

Published : 20 Jan 2022 02:27 IST

అవార్డు కోసం ఉబలాటం.. కరోనా నియంత్రణలో విఫలం

కేసులు పెరుగుతున్నా పట్టించుకోని అధికారులు

మెట్‌పల్లి పట్టణం, న్యూస్‌టుడే

స్వచ్ఛ సర్వేక్షణపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అధికారులు

మెట్‌పల్లి బల్దియా పరిధిలో తడి, పొడి చెత్తను వేరుచేసి బల్దియా ఆటోలకు అందించి స్వచ్ఛసర్వేక్షణ్‌లో ప్రజలు పాలుపంచుకోవాలంటూ నిత్యం బల్దియా అధికారులు వీధివీధినా విస్తృత ప్రచారం చేస్తున్నారు. స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డు వచ్చేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ప్రజల ఆరోగ్యాలపై దృష్టి సారించకపోవడం విడ్డూరంగా మారింది. ఓ పక్క కొవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతూ భయాందోళనకు గురిచేస్తున్న కొవిడ్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. లక్షలు ఖర్చులు చేసి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు కోసం విస్తృత ప్రచారం చేసేందుకు ఫ్లెక్సీలు, హరిత బోర్డులు, ప్రత్యేక ఆటోలు, కరపత్రాలను వినియోగిస్తూ ప్రచారం చేస్తున్నారు. కానీ కరోనా నియంత్రణపై అధికారులు దృష్టి సారించకపోవడంతో పట్టణంలో రోజురోజుకు కేసులు పెరిగే అవకాశం కనిపిస్తుంది.

అధికారుల తీరు ప్రజలు బేజారు..

పట్టణంలోని కొవిడ్‌ కేసు నమోదు అయిందని తెలిస్తే చాలు వెంటనే ఆ ఇంటి వద్దకు పారిశుద్ధ్య కార్మికులతో బ్లీచింగ్‌ చల్లించడం, స్ప్రే చేయిస్తూ వస్తున్నారే తప్పా నిబంధనలను పాటించాలని ఒక్క మాట కూడా చెప్పకపోవడం విడ్డూరంగా మారింది. రెండో విడత కరోనా వచ్చిన సమయంలో కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని పదేపదే ప్రచారం చేస్తూనే నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. జరిమానా విధించారు. దీంతో ప్రజల్లో అవగాహనతో పాటు భయంతో మాస్కులను ధరించే అవసరమున్న వారే బయటకు వచ్చారు. ప్రస్తుతం అవేమి పట్టింపు లేకపోవడంతో ప్రజలు ఇష్టారీతిన తిరుగుతున్నారు. పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద, హోటళ్ల వద్ద, మార్కెట్లలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండే స్థలాల్లో గుంపు గుంపులుగా ఉంటున్నారు. మాస్కులను ధరించడమే కొందరు మరిచిపోయారు. పలు ప్రభుత్వ కార్యాలయాలలో పలువురు ఉద్యోగులు మాస్కులను ధరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. కొందరు ధరించిన అవి పూర్తిగా పెట్టుకోకుండా కేవలం నోరు కింది భాగంలో ఉంచుకోవడం ప్రమాదకరంగా మారింది. పట్టణంలో కొవిడ్‌పై ఇలాగే కొనసాగుతే రానున్న రోజులలో ప్రమాద స్థాయికి కరోనా పెరుగుతుందని ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికైనా బల్దియా అధికారులు కరోనాపై ప్రత్యేక దృష్టి సారించి కరోనా నిబంధనలపై ప్రత్యేక ప్రచారం చేస్తూనే ప్రజల్లో అవగాహన పెంచాల్సినా అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు కరోనా నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటే కరోనాను కొంత వరకైనా అరికట్టిన వారవుతారు. ఈ విషయంపై బల్దియా కమిషనర్‌ సమ్మయ్యను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా కరోనా నియంత్రణ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తామని, మాస్క్‌లు లేని వారికి జరిమానాలు విధిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని