logo

యువ నేతన్నకు కలెక్టర్‌ ప్రశంస

సిరిసిల్లలోని యువ నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను కట్టుకునే విధంగా తయారు చేశారు. ఉంగరంలో ఇమిడే చీరతో పాటు అనేక ప్రయోగాలు

Published : 20 Jan 2022 02:27 IST

హరిప్రసాద్‌ నుంచి వివరాలు తెలుసుకుంటున్న అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే: సిరిసిల్లలోని యువ నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను కట్టుకునే విధంగా తయారు చేశారు. ఉంగరంలో ఇమిడే చీరతో పాటు అనేక ప్రయోగాలు చేయడంతో బుధవారం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వాటిని పరిశీలించారు. రకరకాల నూలుతో ఇలాంటి ప్రయోగాలు సృష్టిస్తూ సిరిసిల్ల పేరును ఖండాంతరాలు దాటిస్తున్నారని, ఇలాంటి యువ నేత కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇంకా అనేక కళాకండాలను తయారు చేయాలని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని