logo

శత శాతం టీకా పంపిణీకి చర్యలు

జిల్లాలో కొవిడ్‌ నియంత్రణ చర్యలు పటిష్ఠంగా చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. బుధవారం ఆయన దూరదృశ్య మాధ్యమంలో జడ్పీ ఛైర్మన్‌ పుట్ట

Published : 20 Jan 2022 02:27 IST

దూరదృశ్య మాధ్యమ సదస్సులో పాలనాధికారిణి సంగీత

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌ నియంత్రణ చర్యలు పటిష్ఠంగా చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. బుధవారం ఆయన దూరదృశ్య మాధ్యమంలో జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు, పెద్దపల్లి, రామగుండం శాసనసభ్యులు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌, పాలనాధికారిణి డాక్టర్‌ సర్వే సంగీత సత్యనారాయణ, వైద్య సిబ్బందితో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్‌ టీకా పంపిణీలో నూరు శాతం ప్రగతి సాధించాలని ఆదేశించారు. జూలపల్లి, రాగినేడు, శ్రీరాంపూర్‌ పీహెచ్‌సీల పరిధిలో వ్యాక్సినేషన్‌ తక్కువగా ఉందని, అధికారుల సమన్వయంతో శత శాతం లక్ష్యంగా పని చేయాలన్నారు. కేసులు పెరుగుతున్నందున అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఒమ్రికాన్‌ ప్రబలకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, కిట్ల వివరాలను కలెక్టర్‌ పరిశీలించాలని సూచించారు. ఈ సందర్భంగా పాలనాధికారిణి సంగీత జిల్లాలో కొవిడ్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లాలో టీకా పంపిణీలో మొదటి డోస్‌ 6 లక్షలు, రెండో డోస్‌ 4.26 లక్షలు పూర్తయిందన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో రెండో డోస్‌ లక్ష్యాలు చేరుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని