logo

అక్రమ నిర్మాణాల కూల్చివేత షురూ

జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతను టాస్క్‌ఫోర్స్‌ అధికారుల బృందం ఆధ్వర్యంలో చేపట్టింది. కూల్చివేతను మున్సిపల్‌ కమిషనర్‌ బి.సుమన్‌రావు,

Updated : 20 Jan 2022 02:28 IST

పాత మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో ఇంటిని కూల్చివేస్తున్న అధికారులు

జమ్మికుంట, న్యూస్‌టుడే : జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతను టాస్క్‌ఫోర్స్‌ అధికారుల బృందం ఆధ్వర్యంలో చేపట్టింది. కూల్చివేతను మున్సిపల్‌ కమిషనర్‌ బి.సుమన్‌రావు, తహసీల్దార్‌ ఎస్‌.రాజిరెడ్డి, ఎస్‌ఐ రాంమోహన్‌ పర్యవేక్షించారు. మొదటి రోజు మూడు నిర్మాణాలను కూల్చివేశారు. మరో భవన నిర్మాణానికి 17 ఫీట్ల స్థలాన్ని సెట్‌ బ్యాక్‌ చేసి, కట్డడాన్ని కూల్చివేయాలని యజమానికి గడువు ఇచ్చారు. కొలతలు వేస్తున్న సమయంలో స్థానిక 25వ వార్డు కౌన్సిపలర్‌ బచ్చు మాధవి, మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ బి.శివశంకర్‌ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొత్తగా నిర్మిస్తున్న భవనానికే మార్కింగ్‌ ఇవ్వటంపై అభ్యంతరం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని