logo

బూస్టర్‌డోసు టీకాపై ప్రత్యేక శ్రద్ధ

జిల్లాలో 15 నుంచి 18ఏళ్ల లోపు ఉన్న వారికి, బూస్టర్‌ డోసు తీసుకునే వారి విషయంలో జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు సూచించారు. గురువారం మంత్రి

Published : 21 Jan 2022 03:18 IST

జిల్లా వైద్యాధికారులకు మంత్రి హరీశ్‌రావు అభినందనలు

దృశ్యమాధ్యమ సమీక్షలో కలెక్టర్‌ కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

కరీంనగర్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో 15 నుంచి 18ఏళ్ల లోపు ఉన్న వారికి, బూస్టర్‌ డోసు తీసుకునే వారి విషయంలో జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు సూచించారు. గురువారం మంత్రి జిల్లా అధికారులతో వీడియో కాన్పరెన్స్‌లో మాట్లాడారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ రెండో డోసులో కరీంనగర్‌ జిల్లా మొదటిస్థానంలో ఉందని, జిల్లా వైద్యాధికారులను అభినందించారు. అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందుబాటులో ఉండాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దయాకర్‌రావు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, వైద్యాధికారులు జువేరియా, రత్నమాల, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని