logo

కొబ్బరికుడుకల గోదాంలో భారీ అగ్నిప్రమాదం

కరీంనగర్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీ బైపాస్‌ మార్గంలో ఉన్న కొబ్బరి, కుడుకల గోదాంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన రాజు నెల రోజుల

Updated : 08 Dec 2022 17:25 IST

రూ.15 లక్షల విలువైన సామగ్రి ఆహుతి

గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే : కరీంనగర్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీ బైపాస్‌ మార్గంలో ఉన్న కొబ్బరి, కుడుకల గోదాంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన రాజు నెల రోజుల కింద కొబ్బరి, కుడుకల గోదాంను ప్రారంభించి వ్యాపారం సాగిస్తున్నారు. దేవాలయాల్లో సేకరించిన కొబ్బరి కుడుకల నుంచి నూనె తయారీ కోసం ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తుంటారు. సుమారు రూ.15 లక్షల విలువైన 10 టన్నుల కొబ్బరి కుడుకలను గోదాంలో నిల్వ ఉన్నట్లు యజమాని తెలిపారు. గురువారం రాత్రి 9 గంటలకు పని ముగించుకొని ఇంటికి వెళ్లిన కొంత సేపటికి గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలియడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కరీంనగర్‌, మానకొండూర్‌ చెందిన అగ్నిమాపక యంత్రాలు గోదాం వద్దకు చేరుకుని మంటలను అదపు చేశాయి. నీరు ఎక్కువ అవసరం పడుతుండటంతో నగరపాలక సంస్థ నుంచి సైతం నీటిని తెప్పించుకున్నారు. రెండు గంటల పాటు శ్రమించిన అనంతరం మంటలను అదుపులోకి తెచ్చారు. దర్యాప్తు అనంతరం ప్రమాద నష్టం వెల్లడిస్తామని జిల్లా అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి వెంకన్న తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని