logo

సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకండి : సీపీ

మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకూడదని రామగుండం పోలీసు కమిషనర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కాలంలో సైబర్‌

Published : 23 Jan 2022 02:25 IST

చంద్రశేఖర్‌రెడ్డి

గోదావరిఖని, న్యూస్‌టుడే : మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకూడదని రామగుండం పోలీసు కమిషనర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్ల మోసాలు ఎక్కువవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే వారి మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. ఉద్యోగాల పేరుతో పాటు క్రెడిట్‌ కార్డు, బ్యాంకు అకౌంట్‌ పిన్‌ ఛేంజ్‌, లాటరీల ద్వారా గెలుచుకున్నారని, బహుమతుల పేరిట అనేక రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీలతో కూడా మోసాలకు పాల్పడుతున్నారని, బ్యాంకు ఖాతా వివరాలు తెలియక చెబితే వారి డబ్బులు కాజేస్తున్నారని వెల్లడించారు. సైబర్‌ నేరగాళ్ల మోసాలకు బలి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ తెలియక మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. సైబర్‌ క్రైం జాతీయ హెల్ప్‌లైన్‌ టోల్‌ఫ్రీ 100, 112, 155260 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసే సమయంలో ఫోన్‌ నంబరు, ఖాతా ఉన్న బ్యాంకు, వ్యాలెట్‌ పేరు, ఖాతా నంబరు, మర్చంట్‌ ఐడీ, యూపీ ఐడీ, లావాదేవీలు జరిపిన ఐడీ, తేదీ, సమయం, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపితే వాటి నంబరు స్క్రీన్‌షాట్లను తీసి పెట్టుకోవాలని వెల్లడించారు.

రామగుండం సీపీకి ఐజీగా పదోన్నతి

గోదావరిఖని: రామగుండం పోలీసు కమిషనర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డికి ఐజీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు పోలీసు అధికారులకు ఐజీగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామగుండం పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్న ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి ప్రస్తుతం డీఐజీ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. 2004 ఐపీఎస్‌ కేడర్‌కు చెందిన పోలీసు అధికారులకు ఐజీలుగా పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం ఐజీ హోదాలోనే రామగుండం పోలీసు కమిషనర్‌గా విధులు కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని