logo

త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీత్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి. కొంత మంది సంగీత కళాకారుల మధ్య వీటిని ప్రారంభించారు. ముందుగా

Published : 23 Jan 2022 02:25 IST

ఉత్సవాలను ప్రారంభిస్తున్న ఏఈవో శ్రీనివాస్‌, ఆలయ స్థానాచార్యుడు భీమాశంకర్‌శర్మ, అర్చకులు

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీత్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి. కొంత మంది సంగీత కళాకారుల మధ్య వీటిని ప్రారంభించారు. ముందుగా ఆలయ అద్దాల మండపం వద్ద లాంఛనంగా ఆరంభించారు. అనంతరం  త్యాగరాజ స్వామి చిత్రపటాన్ని అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయం చుట్టూ ఊరేగించారు. తరవాత ఆలయ ఓపెన్‌ స్లాబ్‌పై ఏర్పాటు చేసిన వేదికపై ప్రతిష్ఠించి ఆలయ స్థానాచార్యుడు అప్పాల భీమాశంకర్‌ శర్మ, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్‌ జ్యోతిని వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ నెల 26 వరకు కొనసాగుతాయి. కొవిడ్‌, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న కారణంగా ఆలయ అధికారులు ఉత్సవాలను అంతరంగికంగానే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుర్ర అరుణ బృందం పంచరత్న గానం, సింహాచలశాస్త్త్ర్రి భాగవతార్‌ త్యాగరాజ చరిత్ర హరికథ ఆకట్టుకుంది. సాయంత్రం నాగూర్‌బాబుచే వేణువు కచేరి జరిగింది. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు నమిలికొండ ఉమేష్‌, దుమాల వాసు, ప్రతాప శ్రీనివాస్‌, శ్రీధర్‌శర్మ, సువర్ణ, రాధాకృష్ణ, మధు, హరీశ్‌,  ఉత్సవ ఇన్‌ఛార్జి రామయ్యశర్మ, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

పంచరత్న గానం ఆలపిస్తున్న కళాకారులు అరుణ, పద్మ, అనుపమ, రేవతి, సునీత, మంజుల, సంగీత, నరహరి తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని