logo

సిబ్బంది పనితీరు భేష్‌

కరోనా టీకా రెండో డోసు విషయంలో శతశాతం ప్రగతిని సాధించిన జిల్లా యంత్రాంగాన్ని కరీంనగర్‌ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అభినందిస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రాణాలను లెక్క చేయకుండా గ్రామాల్లో, పట్టణాల్లో సేవలు అందించిన

Published : 27 Jan 2022 04:49 IST

అభినందించిన ఎంపీ బండి సంజయ్‌

న్యూస్‌టుడే- తెలంగాణచౌక్‌: కరోనా టీకా రెండో డోసు విషయంలో శతశాతం ప్రగతిని సాధించిన జిల్లా యంత్రాంగాన్ని కరీంనగర్‌ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అభినందిస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రాణాలను లెక్క చేయకుండా గ్రామాల్లో, పట్టణాల్లో సేవలు అందించిన వైద్యఆరోగ్య సిబ్బంది పనితీరు భేష్‌ అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్‌కు బుధవారం ఫోన్‌ చేసి ప్రశంసించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అనుసరించిన విధానాల వల్ల మంచి ఫలితం వచ్చిందన్నారు. ప్రధానమంత్రి మోదీ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్‌ అందించి రక్షగా నిలిచారని కేంద్ర ప్రభుత్వ చొరవను ఎంపీ తెలియజేశారు. జిల్లాలోని వైద్యులతోపాటు ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల సేవలు అభినందనీయమని సంజయ్‌ పేర్కొన్నారు. కరోనా నియంత్రణ దిశగా యంత్రాంగం చూపించిన చొరవ ఇక ముందు మరింత స్ఫూర్తిదాయకంగా కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని