logo

తెల్లగీత.. ఇక సులువు

రహదారులపై ముగ్గు చేతిలో పట్టుకుని గీతగీసే విధానంతో కాకుండా యంత్రం ద్వారా ఎలాంటి శ్రమ లేకుండా చేపట్టే విధానాన్ని ఓ యువకుడు తన ఆలోచనతో ఆవిష్కరించాడు. వీఐపీలు వచ్చిన సందర్భంలో రోడ్డు పక్కన తెల్లని గీత గీస్తారు. ఏదైనా కార్యక్రమాలు

Published : 27 Jan 2022 04:49 IST

యంత్రం తయారు చేసిన యువకుడు


యంత్రంతో భగత్‌ప్రశాంత్‌

హదారులపై ముగ్గు చేతిలో పట్టుకుని గీతగీసే విధానంతో కాకుండా యంత్రం ద్వారా ఎలాంటి శ్రమ లేకుండా చేపట్టే విధానాన్ని ఓ యువకుడు తన ఆలోచనతో ఆవిష్కరించాడు. వీఐపీలు వచ్చిన సందర్భంలో రోడ్డు పక్కన తెల్లని గీత గీస్తారు. ఏదైనా కార్యక్రమాలు జరిగిన సమయంలోనూ ఆ దారిని గుర్తించేందుకు ప్రధాన రహదారి పక్క నుంచి తెల్లని గీత వేస్తారు. ఒక మనిషి చేతిలో తెల్లని పొడి పట్టుకొని గీస్తూ ముందుకు సాగాలి. ఈ యువకుడు తయారు చేసిన యంత్రంతో అలాంటి శ్రమ లేకుండా సులువుగా పనిచేసే అవకాశం కలిగింది. గోదావరిఖనికి చెందిన భగత్‌ప్రశాంత్‌ తన ఆలోచనతో ఇనుప రేకుతో ఒక డబ్బాను తయారు చేశాడు. దానికి మూడు చక్రాలు అమర్చాడు. ఇనుప రాడ్‌తో పట్టుకోవడానికి హ్యాండిల్‌ను ఏర్పాటు చేశాడు. దానికి సైకిల్‌ బ్రేకును అమర్చాడు. రేకు డబ్బాకు కింద చిన్న రంధ్రం చేశాడు. దీనికి చిన్న పిల్లల సైకిల్‌ చక్రాలు, ఇనుప రేకు, సైకిల్‌ బ్రేకు సెట్‌, లాక్స్‌ కేబుల్‌ను వినియోగించాడు. రేకు డబ్బాలో తెల్లని ముగ్గు పోసి ముందుకు నడుపుకొంటూ వెళ్తూ బ్రేకు నొక్కి పట్టుకుంటే కింద నుంచి తెల్లని గీత ఏర్పడుతుంది. కళ్లలో ముగ్గు ధూళి పడే అవకాశం లేకపోవడంతో పాటు వంగి పనిచేయడం వల్ల వచ్చే నొప్పి కూడా లేకుండా ఉంటుందని భగత్‌ ప్రశాంత్‌ తెలిపారు. చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసిన ఈ యంత్రాన్ని గ్రామ పంచాయతీ, పురపాలక, నగరపాలక సంస్థల్లో వినియోగించుకుంటే పని సులువుగా చేసుకోవచ్చని చెబుతున్నారు.

-న్యూస్‌టుడే, గోదావరిఖని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని