logo

కరోనా సోకిన గర్భిణికి ప్రసవం

వైద్య సిబ్బంది కరోనా రోగులకు అండగా నిలుస్తున్నారు. ప్రాణాలకు తెగించి మరీ చికిత్స అందిస్తున్నారు. కరోనా బారిన పడ్డ మహిళలకు సాధారణ ప్రసవం చేసి మానవత్వం చూపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన

Published : 27 Jan 2022 04:49 IST

మగ శిశువుతో వైద్య సిబ్బంది

ఎల్లారెడ్డిపేట, న్యూస్‌టుడే : వైద్య సిబ్బంది కరోనా రోగులకు అండగా నిలుస్తున్నారు. ప్రాణాలకు తెగించి మరీ చికిత్స అందిస్తున్నారు. కరోనా బారిన పడ్డ మహిళలకు సాధారణ ప్రసవం చేసి మానవత్వం చూపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన గర్భిణికి రెండు రోజుల క్రితం కొవిడ్‌ సోకింది. బుధవారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు వీలు లేకపోవడంతో జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, ఎంసీహెచ్‌ అధికారి కపిల్‌సాయి సూచనలతో ఎల్లారెడ్డిపేట వైద్య సిబ్బంది పుష్పలత, సుజాత, కీర్తిలు పీపీఈ కిట్లు ధరించి పురుడు పోశారు. సాధారణ ప్రసవం చేసిన వైద్య సిబ్బందిని మండల వైద్యాధికారి ధర్మానాయక్‌, స్థానికులు అభినందించారు.

వైద్య సిబ్బందికి మంత్రి కేటీఆర్‌ అభినందన

కరోనా బారిన పడ్డ మహిళకు ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ప్రసవం చేశారు. ఈ విషయాన్ని రాజన్నసిరిసిల్ల జిల్లా వైద్యాధికారి ట్విటర్‌లో పంచుకున్నారు. సిబ్బంది పనితీరు మెచ్చిన మంత్రి కేటీఆర్‌ అభినందిస్తూ బుధవారం ట్వీట్‌ చేశారు. ‘వెల్‌ డన్‌’ అంటూ వారిని ట్విటర్‌ వేదికగా ప్రశంసించారు. మంత్రి హరీశ్‌రావు సైతం ఎల్లారెడ్డిపేట వైద్య సిబ్బందిని అభినందించారు.

గోశాలలకు రాజన్న కోడెల అప్పగింత

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే : వేములవాడ ఆలయానికి చెందిన తిప్పాపూర్‌ గోశాల నుంచి కోడెలను ఇతర గోశాలలకు ఆలయ అధికారులు బుధవారం అందజేశారు. మహబూబాబాద్‌ జిల్లా పెద్ద వంగర మండలంలోని పోచంపల్లి గ్రామ మహేశ్వరి గోశాల వెల్ఫేర్‌ సోసైటికీ, జనగాం జిల్లా జాపర్‌గడ్‌ మండలంలోని ముగ్దంతండా సంతోషి మాత గోశాలకు ఒక్కొక్క దానికి 20 కోడెల చొప్పున అందజేశారు. కోడెలకు చెందిన ధ్రువపత్రాలను గోశాల నిర్వాహకులకు అందజేశారు. కార్యక్రమంలో ఏఈవో శ్రీనివాస్‌,  సూపరింటెండెంట్‌ హరిహరినాథ్‌, రాజేందర్‌, శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని