logo

పీటీసీలో డ్రిల్‌ నర్సరీ ప్రారంభం

కరీంనగర్‌ పోలీసు శిక్షణ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రిల్‌ నర్సరీని గురువారం రాష్ట్ర అదనపు డీజీపీ వీవీ శ్రీనివాసరావు ప్రారంభించారు. పీటీసీ ప్రిన్సిపల్‌ జి.సునీతమోహన్‌ పర్యవేక్షణలో డ్రిల్‌ నర్సరీ, లాంజ్‌, సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు.

Published : 28 Jan 2022 03:33 IST

నామఫలకాన్ని ఆవిష్కరిస్తున్న అదనపు డీజీపీ శ్రీనివాసరావు

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: కరీంనగర్‌ పోలీసు శిక్షణ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రిల్‌ నర్సరీని గురువారం రాష్ట్ర అదనపు డీజీపీ వీవీ శ్రీనివాసరావు ప్రారంభించారు. పీటీసీ ప్రిన్సిపల్‌ జి.సునీతమోహన్‌ పర్యవేక్షణలో డ్రిల్‌ నర్సరీ, లాంజ్‌, సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. వాటిని సైతం ఆయన ప్రారంభించారు. పోలీసు శాఖలో నూతనంగా చేరిన వారికి శిక్షణ ఎంత ముఖ్యమో, డ్రిల్‌ నర్సరీ అంతే ముఖ్యమన్నారు. ప్రతి శిక్షణ కేంద్రంలో డ్రిల్‌ నర్సరీలు ఏర్పాటు చేస్తే  ఉద్యోగుల్లో ఎలాంటి భయం లేకుండా శిక్షణ పూర్తి చేసే అవకాశం లభిస్తుందన్నారు. పోలీసులకు ఉత్తమ శిక్షణ అందిస్తున్నందుకు కరీంనగర్‌ పీటీసీ కేంద్ర అవార్డుకు ఎంపికైందని తెలిపారు. శిక్షణకు ఎంపికైన ప్రతి పోలీసు తనకు తాను ప్రతి అంశంపై అవగాహన పొందే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అదనపు డీజీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ, అదనపు డీసీపీ చంద్రమోహన్‌, పీటీసీ వైస్‌ ప్రిన్సిపల్‌ ఎన్‌.రవి, డీఎస్పీలు కాశయ్య, గంగాధర్‌లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని