logo

సామాజిక ఆసుపత్రికి మహర్దశ

సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఈ ఆసుపత్రి పని చేస్తోంది. ఈ మేరకు గురువారం వైద్యవిధాన పరిషత్‌ జిల్లా

Published : 28 Jan 2022 03:33 IST

వైద్య విధాన పరిషత్‌లోకి సుల్తానాబాద్‌ దవాఖానా


సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి

న్యూస్‌టుడే, సుల్తానాబాద్‌: సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఈ ఆసుపత్రి పని చేస్తోంది. ఈ మేరకు గురువారం వైద్యవిధాన పరిషత్‌ జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి మందల వాసుదేవారెడ్డికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్‌కుమార్‌ ఉత్తర్వులు అందజేశారు.

50 పడకలకు ఉన్నతీకరణ

* ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న సామాజిక ఆసుపత్రి వైద్య విధాన పరిషత్‌ పరిధిలోకి వస్తే మరిన్ని సౌకర్యాలు, వసతులు అందుబాటులోకి వస్తాయి. తద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందుతుంది.

* ప్రస్తుతం 30 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రి వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోకి వస్తే 50 పడకలకు ఉన్నతీకరణ చెందుతుంది.

* 24 గంటల పాటు వైద్య సేవలు, నిపుణులైన వైద్యుల సేవలు అందుబాటులోకి వస్తాయి.

* రోగులకు అల్పాహారం, భోజన సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

* ఆసుపత్రికి నిధుల రాక పెరుగుతుంది. మెరుగైన వసతులు, పారిశుద్ధ్య సేవల నిర్వహణ ఉంటుంది.


24 గంటల పాటు మెరుగైన సేవలు
వాసుదేవరెడ్డి, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త

పరిసర మండలాలకు సుల్తానాబాద్‌ ముఖ్య కూడలిగా ఉంటుంది. సామాజిక ఆసుపత్రి వైద్య విధాన పరిషత్‌ పరిధిలోకి వస్తే సౌకర్యాలు, వసతులు మెరుగుపడతాయి. రోగులకు 24 గంటల పాటు నాణ్యమైన, మెరుగైన వైద్యం అందుబాటులోకి ఉంటుంది. పూర్తి స్థాయిలో వసతులు ఏర్పాటు చేసి త్వరలోనే మెరుగైన సేవలు అందిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని