logo

రాజన్న హుండీ ఆదాయం రూ.55.16 లక్షలు

ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ.55,16,933లు సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. గురువారం ఆలయ ఒపెన్‌ స్లాబ్‌పై 8 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు.

Published : 28 Jan 2022 03:33 IST

హుండీ డబ్బులను లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

వేములవాడ గ్రామీణం : ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ.55,16,933లు సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. గురువారం ఆలయ ఒపెన్‌ స్లాబ్‌పై 8 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. బంగారం 65 గ్రామల 250 మిల్లిగ్రాములు, వెండి 3 కిలోల 180 గ్రాములను భక్తులు కానుకలుగా సమర్పించినట్లు ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవోలు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.

వేములవాడ ఆలయం, న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం భక్తుల సందడి కొనసాగింది. సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా స్వామివారిని దర్శించుకునే ఆనవాయితీ ఉండటంతో భక్తులు తరలి వచ్చారు. కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ పూజ కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. ధర్మగుండం మూసి ఉండటంతో భక్తులు బయట కొబ్బరి కాయలు కొట్టి గుండంలో వేసి మొక్కులు చెల్లించుకున్నారు. గండాలు తొలగాలని గండా దీపంలో నూనె పోసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ చేశారు. దాదాపు 10 వేలకు పైగా మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని