logo

అంతర్‌ రాష్ట్ర దొంగ అరెస్టు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం అరెస్టు చేసినట్లు ప్రకాశం జిల్లా చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్‌ తెలిపారు. జిల్లాలోని సంతనూతలపాడుకు చెందిన తన్నీరు శ్రీనుపై తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్‌లో 9 కేసులు ఉన్నాయి. పర్చూరు పరిధిలో 2,

Published : 28 Jan 2022 03:33 IST

పర్చూరు, న్యూస్‌టుడే: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం అరెస్టు చేసినట్లు ప్రకాశం జిల్లా చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్‌ తెలిపారు. జిల్లాలోని సంతనూతలపాడుకు చెందిన తన్నీరు శ్రీనుపై తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్‌లో 9 కేసులు ఉన్నాయి. పర్చూరు పరిధిలో 2, వేటపాలెం, అద్దంకి స్టేషన్ల పరిధిలో ఒక్కో కేసుకు సంబంధించి 22 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఇంకొల్లు సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిఘా ఉంచి పర్చూరు వై జంక్షన్‌లో నిందితుడిని గుర్తించి ఎస్సై రమణయ్య అరెస్టు చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఏపీలోని పర్చూరు, టంగుటూరు, ఒంగోలు, నాగులుప్పలపాడు, అద్దంకి, వేటపాలెం, చినగంజాం, తెలంగాణలోని రామగుండం(పెద్దపల్లి జిల్లా), సుబేదారి(వరంగల్‌), హుస్నాబాద్‌(సిద్దిపేట) స్టేషన్‌లలో నిందితుడిపై కేసులు ఉన్నట్లు డీఎస్పీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని