logo

చిత్ర వార్తలు

రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు గురువారం తెరుచుకున్నాయి.  విద్యార్థులు కాకుండా కేవలం ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎప్పుడెప్పుడు పాఠశాలలు తెరుస్తారా... పిల్లలు ఎప్పుడు బడికి వెళతారా అని వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.

Published : 28 Jan 2022 03:39 IST

పాఠశాలలకు ఉపాధ్యాయులు

రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు గురువారం తెరుచుకున్నాయి.  విద్యార్థులు కాకుండా కేవలం ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎప్పుడెప్పుడు పాఠశాలలు తెరుస్తారా... పిల్లలు ఎప్పుడు బడికి వెళతారా అని వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. గురువారం నుంచి అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు 50 శాతం మంది రొటేషన్‌ పద్ధతిలో హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడంతో అధ్యాపకులు విద్యాలయాలకు వచ్చారు.  కొత్తపల్లి మండలంలోని  ప్రాథమిక పాఠశాలలో కనిపించిన దృశ్యమిది.

- ఈనాడు, కరీంనగర్‌


మురుగుతో అవస్థలు

ట్టణంలోని బీడీకాలనీలో ప్రధాన రహదారిపై మురుగునీరు నిలిచి దుర్వాసనతో పాటు దోమలు పెరిగి కాలనీ ప్రజలు అవస్థలు పడుతున్నారు. మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, మెట్‌పల్లి పట్టణం


ఫుట్‌పాత్‌ ధ్వంసం

ట్టణ సుందరీకరణలో భాగంగా ప్రధాన రహదారికిరువైపులా సుమారు 4 కి.మీ పొడవునా నూతనంగా మురుగు కాలువ నిర్మాణం చేపట్టారు. కాలినడక కోసం ఫుట్‌పాత్‌ నిర్మించి టైల్స్‌ను పరిచారు. గురువారం మెట్‌పల్లిరోడ్‌లోని ఓరైస్‌మిల్‌ ముందున్న ఫుట్‌పాత్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. ప్రభుత్వ కట్టడాలను ధ్వంసం చేసిన యజమానిపై మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

-న్యూస్‌టుడే, కోరుట్ల


ప్రగతి ప్రాంగణానికి కాంతుల తోరణం

జిల్లాకేంద్రంలోని పెద్దకల్వల క్యాంపులో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సమీకృత పాలనా ప్రాంగణ భవనం బుధవారం రాత్రి విద్యుద్దీపాలతో కాంతులీనింది. నూతన భవనంలో విద్యుత్తు లైటింగ్‌, నీటి ఫౌంటేన్‌ల పనితీరును పరీక్షించేందుకు కాంట్రాక్టు కంపెనీ ఉద్యోగులు సాయంత్రం వేళ ఈ ఏర్పాటు చేశారు. ఇందులో ఆవరణలోని ఫౌంటేన్‌ ఆకర్షణీయంగా నిలిచింది.

-ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి


సీఎంను కలిసిన చందర్‌

రామగుండం ఎమ్మెల్యే, జిల్లా తెరాస అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో కలిశారు. జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు తన నమ్మకాన్ని నిలబెడతానని సీఎంకు విన్నవించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎంతో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతను కలిసినట్లు వెల్లడించారు.

  -న్యూస్‌టుడే, గోదావరిఖని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని