logo

వానాకాలం ప్రణాళిక సిద్ధం

వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల సాగు వైపు రైతులను మళ్లించేందుకు కార్యాచరణ

Published : 20 May 2022 03:24 IST

 జిల్లాలో 2.64 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా

న్యూస్‌టుడే, సిరిసిల్ల గ్రామీణం: వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల సాగు వైపు రైతులను మళ్లించేందుకు కార్యాచరణ రూపొందించారు. ప్రస్తుతం రైతులు వరికోతలు, పండించిన ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద పనుల్లో నిమగ్నమయ్యారు. మెట్ట ప్రాంతమైన జిల్లాలో మధ్యమానేరు, ఎగువమానేరు, అనంతగిరి ప్రాజెక్టులతో పాటు సంవృద్ధిగా వర్షాలు కురుస్తాయన్న నమ్మకంతో రైతులు ఖరీఫ్‌లో కూడ వరి వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. ప్రభుత్వం ఓ వైపు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నా రైతులు మాత్రం వరి, పత్తి పంటల సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు.

ఈ వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 2.64 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, కంది, పెసర, ఆయిల్‌పామ్‌ తదితర పంటలను అన్నదాతలు సాగు చేయనున్నారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అలాగే కూరగాయలు, పండ్లు, పూల తోటలతో పాటు ఇతర ఉద్యాన పంటలు సాగు చేస్తారు. జిల్లాలో రెండు సీజన్‌లతో పోల్చితే వానాకాలంలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గనుంది. వరి సాగు తగ్గే అవకాశం లేదు. ఈ సారి రైతులు సన్నరకంతోపాటు దొడ్డు రకాలకు కూడ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. వానాకాలం సాగుకు దాదాపు 58 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే వ్యవసాయశాఖ ప్రణాళికలు రూపొందిస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని