logo

కాంపోజిట్‌ సిలిండర్‌ పంపిణీ ప్రారంభం

వంట గ్యాస్‌కు ఉపయోగించే బరువైన సిలిండర్ల స్థానంలో తేలికైన, ఎక్కువ భద్రత కలిగిన కాంపోజిట్‌ సిలిండర్లు వచ్చేశాయి. పెద్దపల్లిలోని ఇండేన్‌ గ్యాస్‌ డీలర్‌ మొదటి కాంపోజిట్‌

Published : 20 May 2022 03:47 IST

పెద్దపల్లి, న్యూస్‌టుడే: వంట గ్యాస్‌కు ఉపయోగించే బరువైన సిలిండర్ల స్థానంలో తేలికైన, ఎక్కువ భద్రత కలిగిన కాంపోజిట్‌ సిలిండర్లు వచ్చేశాయి. పెద్దపల్లిలోని ఇండేన్‌ గ్యాస్‌ డీలర్‌ మొదటి కాంపోజిట్‌ సిలిండర్‌ను గురువారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మమతరెడ్డికి అందజేశారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో కంపెనీ డీలర్, మునిసిపల్‌ కౌన్సిలర్‌ సుద్దమల్ల అమ్రేష్, కొంతం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. అవసరమైన వారు రూ.3350 డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందని, పాత సిలిండర్‌ స్థానంలో తీసుకునేవారికి రూ.1600 తగ్గింపు ఉంటుందని డీలర్‌ తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని