logo
Published : 22 May 2022 04:09 IST

తెలంగాణ కొంగుబంగారం కొండగట్టు అంజన్న

హనుమాన్‌ చాలీసా పారాయణంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, మంత్రి కొప్పుల


ఎమ్మెల్సీ కవితకు పూర్ణకుంభ స్వాగతం పలుకుతున్న అర్చకులు

కొడిమ్యాల, మల్యాల, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారంగా కొండగట్టు ఆంజనేయ స్వామివారిని కొలుచుకుంటామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామివారి చిన్న జయంతి సందర్భంగా ప్రారంభించిన అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణం కార్యక్రమం ఈనెల 25న పెద్ద హనుమాన్‌ జయంతితో 41 రోజులు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో శనివారం ఆలయంలో నిర్వహించిన పారాయణం కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కవిత, ఎల్‌.రమణ, రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, విద్యాసాగర్‌రావు, సంజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణకుంభం, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఆలయంలో రెండోసారి అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, గతేడాది మొదటిసారి కరోనా ముగిసిన తర్వాత 81 రోజుల పాటు అనేక మంది ఇళ్లలోనే చాలీసా పారాయణం చేశారని, ఈసారి 41 రోజుల పాటు చాలీసా పారాయణం చేయడం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. స్వామివారి సన్నిధిలో చాలీసా పారాయణం ఇన్ని రోజులు నిర్వహించడం అదృష్టం, సంతోషాన్నిచ్చిందన్నారు. అంజన్న దయతో తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో వరుసగా రెండోసారి అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయడం హర్షనీయమని, భక్తులు, దీక్షాపరులు పెద్దసంఖ్యలో పాల్గొన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. పలువురు మహిళా భక్తులు ఆలయం వద్ద సమస్యలను ఎమ్మెల్సీ కవితకు విన్నవించుకున్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, కొడిమ్యాల, మల్యాల మండల ఎంపీపీలు మిట్టపెల్లి విమల, స్వర్ణలత, జడ్పీటీసీ సభ్యులు రామ్మోహన్‌రావు, పునుగోటి ప్రశాంతి, సర్పంచులు తిరుపతిరెడ్డి, సుదర్శన్‌, సింగిల్విండో ఛైర్మన్‌ రాజనర్సింగరావు, ఆలయ ఈవో వెంకటేష్‌, ఫౌండర్‌ ట్రస్టీ మారుతి, పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


స్వామివారికి హారతి ఇస్తున్న అర్చకులు

అఖండ చాలీసా పారాయణం చేస్తున్న దీక్షాపరులు, భక్తులు

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని