logo

గ్రానైట్‌ సంస్థల్లో పేలుడు పదార్థాలు : యజమానులపై కేసు

నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్న గ్రానైట్‌ యజమానులపై కరీంనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అసాంఘిక శక్తులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన కరీంనగర్‌ కమిషనరేట్‌ పోలీసులు పలు గ్రానైట్‌ సంస్థలపై నిఘా ఉంచారు.

Published : 22 May 2022 04:09 IST

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్న గ్రానైట్‌ యజమానులపై కరీంనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అసాంఘిక శక్తులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన కరీంనగర్‌ కమిషనరేట్‌ పోలీసులు పలు గ్రానైట్‌ సంస్థలపై నిఘా ఉంచారు. శనివారం కమిషరేట్‌కు చెందిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. కొత్తపల్లి మండలం నాలుగుమల్యాల గ్రామంలో కొనసాగుతున్న సంధ్యా ఇంటర్నేషనల్‌ గ్రానైట్‌ సంస్థలో ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్న 17 స్లర్రీ పదార్థలు, 20 ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లు గుర్తించారు. సంస్థ యాజమాని అయిన జలగం లింగారావు, మేనేజర్‌ రమేష్‌పై కేసు నమోదు చేశారు. అధిక లోడ్‌తో రవాణా చేస్తున్న ఎల్‌ఎండీకి చెందిన మూడు లారీలు, కొత్తపల్లికి చెందిన మూడు లారీలు, గంగాధరకు చెందిన 4 ప్రైవేటు గ్రానైట్‌ సంస్థలకు చెందిన లారీలు పట్టుకొని యజమానులకు నోటీలసులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని