logo

నిరుద్యోగులకు వరం.. వారధి యాప్‌

ఒప్పంద ఉద్యోగాల కోసం వెలిసిన వారధి సొసైటీ నేడు వందలాది మందికి ఆపన్న హస్తంలా మారింది. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక పద్ధతిన ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటోంది.

Published : 22 May 2022 04:09 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సంక్షేమవిభాగం


ఇటీవల యాప్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాలనాధికారి కర్ణన్‌

ఒప్పంద ఉద్యోగాల కోసం వెలిసిన వారధి సొసైటీ నేడు వందలాది మందికి ఆపన్న హస్తంలా మారింది. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక పద్ధతిన ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటోంది. గతంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, ఫర్నీచర్‌ అందించడంతో పాటు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చింది. ఈ సొసైటీ నుంచి శిక్షణ తీసుకుని వందమందికి పైగా అభ్యర్థులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు 300 మంది నిరుద్యోగ యువతకు పోలీస్‌ శాఖ సౌజన్యంతో శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఉపయోగపడేలా ‘వారధి యాప్‌’ ఇటీవల జిల్లా పాలనాధికారి ఆర్‌వీ.కర్ణన్‌ విడుదల చేశారు. యాప్‌ విశేషాలపై ‘న్యూస్‌టుడే’ కథనం

ఫోన్‌ నెంబర్‌తో...

చరవాణిలో ప్లేస్టోర్‌ నుంచి వారధి డిజిటల్‌ సర్వీస్‌ అని నమోదు చేయగానే వారధి యాప్‌ కనిపిస్తుంది. ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. చరవాణి నెంబర్‌తో లాగిన్‌ కాగానే అభ్యర్థి పూర్తిపేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్‌ అడ్రస్‌, ఆధార్‌ నెంబర్‌, వివాహం, కులం వివరాలను అందులో నమోదు చేయాలి. అనంతరం ఓటీపీ అడుగుతుంది. చరవాణికి వచ్చిన ఓటీపీ నమోదు చేయగానే యాప్‌ ఓపెన్‌ అవుతుంది.

ప్రచురణకర్తలకు సదావకాశం : -ఆంజనేయులు, వారధి సొసైటీ సభ్యకార్యదర్శి (మెంబర్‌, సెక్రెటరీ)

ప్రస్తుతం యాప్‌లో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు టెట్‌, గ్రూప్‌-1, పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై సెలబస్‌ మొత్తం ఏర్పాటు చేశాం. అభ్యర్థులు మాక్‌ టెస్ట్‌ రాసుకోవచ్ఛు పోటీ పరీక్షలకు సంబంధించిన మెటిరీయల్‌ ఉంటే ఎవరైన పబ్లిషర్స్‌ అందజేస్తే యాప్‌లో పొందుపరుస్తాం. స్టడీ సర్కిల్‌ నుంచి, మా ప్యాకల్టీ తయారు చేసిన ప్రశ్నపత్రాలను త్వరలోనే అప్‌డేట్‌ చేస్తాం.


ఏమున్నాయి

యాప్‌లో ఎన్‌సీఈఆర్‌టీ, రాష్ట్ర పాఠ్యాంశ పుస్తకాలు 7వ తరగతి నుంచి ఇంటర్మిడియట్‌ వరకు ఉంటాయి. ఆ పుస్తకాలు అందులోనే చదువుకోవడంతో పాటు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో ప్రభుత్వం విడుదల చేసిన సిలబస్‌ ప్రకారం గ్రూప్‌-1, పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై పోటీ పరీక్షలకు సంబంధించిన మెటిరీయల్‌ మొత్తం ఉంటుంది. ఆంగ్లం, సైన్స్‌, టెక్నాలజీ, కరెంట్‌ ఆఫైర్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఇండియన్‌ ఎకానమీ 1, 2, రాజ్యాంగం 1, 2, చరిత్ర 1, 2, ఆర్థమెటిక్‌, ఇండియన్‌ పాలిటీ పై మాక్‌ పరీక్షలు రాసుకోవచ్ఛు 50 మార్కులు 50 నిమిషాల సమయం ఉంటుంది. దీంతో అభ్యర్థులు ఎంతమేరకు చదివారో తెలిసిపోతుంది. ప్రశ్నలను డౌన్‌లోడ్‌ చేసుకోని సాధన చేయవచ్ఛు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్‌, వారధి సొసైటీలో నిరుద్యోగులకు తరగతులు చెప్పే ఫ్యాకల్టీ తయారు చేసిన పలు మాదిరి ప్రశ్నపత్రాలు ఈ యాప్‌లో అందుబాటులో ఉండనున్నాయి. సలహాలు, సూచనల కోసం మనకు సమీపంలో స్టడీ సెంటర్ల వివరాలతో పాటు రాష్ట్రంలోని ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్ల ఫోన్‌ నెంబర్లు ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత సమాచారంతో పాటు విద్యార్థి చదువు, ఎన్ని మాక్‌ పరీక్షలు రాశారు అనే వివరాలు నమోదు కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని