logo

కలెక్టర్లకు ఆదాయ టార్గెట్‌ పెట్టడం శోచనీయం

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని వేలం పాట ద్వారా విక్రయించి ఆదాయం తేవాలని ప్రతి కలెక్టర్‌కు టార్గెట్‌ పెట్టడం శోచనీయమని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 24 May 2022 04:30 IST

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ప్రజావాణిలో లేఖను అందజేస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: ధనిక రాష్ట్రమైన తెలంగాణలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని వేలం పాట ద్వారా విక్రయించి ఆదాయం తేవాలని ప్రతి కలెక్టర్‌కు టార్గెట్‌ పెట్టడం శోచనీయమని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన రాజీవ్‌ స్వగృహ ఆర్జీదారుల చారిటీ, సంక్షేమ సంఘం సభ్యులను ఆయన కలిని మద్దతు ప్రకటించారు.  జిల్లా పాలనాధికారి వెంటనే పునరాలోచించి వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కె.నరేందర్‌రెడ్డి, రాజీవ్‌ స్వగృహ బాధితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

గంగాధర: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరి ధాన్యం క్వింటాలుకు రూ. 2500 మద్దతు ధర చెల్లిస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామంలో సోమవారం టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమంలో జీవన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న నాకు ఇల్లు కూడా సరిగా లేదు కానీ మూడేళ్లలోనే ఇక్కడి ఎమ్మెల్యే నాలుగంతస్తుల మేడ కట్టారని, ఎక్కడి నుంచి సొమ్ములు వచ్చాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మనోహర్‌, రమణారెడ్డి, రామిడి రాజిరెడ్డి, ఉయ్యాల శ్రీనివాస్‌, కొలెపాక స్వామి, బూర్గు గంగయ్య, మంత్రి మహేందర్‌, జాగిరపు శ్రీనివాస్‌రెడ్డి, పెద్దెల్లి అంజయ్య, చక్రపాణి, భాస్కర్‌ పాల్గొన్నారు.

పాల ఉత్పత్తిదారుల ప్రోత్సాహక రాయితీ విడుదల చేయాలి

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం సభ్యులకు పాల ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం అందించే రాయితీ రూ.4 విడుదల చేయాలని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ప్రజావాణి ద్వారా లేఖను అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌కు అందజేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీ పెండింగ్‌ నిధులు విడుదల చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని