logo

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పతనం తప్పదు’

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పతనం తప్పదని ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌(ఏఐఎఫ్‌బీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన

Published : 24 May 2022 04:30 IST

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పతనం తప్పదని ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌(ఏఐఎఫ్‌బీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిక ధరలు, పన్నుల భారానికి వ్యతిరేకంగా 10 వామపక్షాలు పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలపై చర్చించి జయప్రదం చేయాలని కోరారు.ఎనిమిదేళ్లలో కేంద్రం పదే పదే పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు పెంచుతూ ప్రజల నుంచి రూ.26 లక్షల కోట్లను వసూలు చేసిందని వివరించారు. పార్టీ ఉత్తర తెలంగాణ కన్వీనర్‌ అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 27న పట్టణ, మండల కేంద్రాల్లో నిరసనలు, 30న కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్‌, మహిళా విభాగం జిల్లా కన్వీనర్‌ ప్రసన్న, ఏఐఎస్‌బీ రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ వంశీధర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. మహిళా విభాగం కో-కన్వీనర్‌ రఫియా సుల్తానా ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరగా వారికి సురేందర్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని