logo

పది పరీక్షలు ప్రారంభం

జిల్లాలో రెండేళ్ల అనంతరం జరుగుతున్న ఎస్సెస్సీ పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 81 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ప్రథమ భాష పేపర్‌-1 పరీక్షకు 12,767 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 12,693

Published : 24 May 2022 04:30 IST

కరీంనగర్‌ విద్యా విభాగం: జిల్లాలో రెండేళ్ల అనంతరం జరుగుతున్న ఎస్సెస్సీ పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 81 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ప్రథమ భాష పేపర్‌-1 పరీక్షకు 12,767 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 12,693 మంది హాజరయ్యారు. 74 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ పేర్కొంది. గైర్హాజరైన వారిలో 73 మంది రెగ్యులర్‌, ఒక్కరు ప్రైవేటు విద్యార్థి ఉన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు 8 గంటల అనంతరం చేరుకున్నా చాలా కేంద్రాల్లో హాల్‌టికెట్‌ నెంబర్ల ఆధారంగా కేటాయించిన గదుల వివరాలను ప్రదర్శించడంలో ఆలస్యం నెలకొనడంతో విద్యార్థులు హైరానా పడ్డారు.   కరీంనగర్‌లోని ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాల, వాణినికేతన్‌ బాల విహార్‌ పాఠశాలల్లో ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాలను జిల్లా పాలనాధికారి కర్ణన్‌ తనిఖీ చేశారు. ఓఎంఆర్‌ షీట్లు, ప్రశ్నపత్రాలను పరిశీలించి సమస్యలేమైనా ఉన్నాయా అంటూ వారిని అడిగి తెలుసుకున్నారు. డీఈవో జనార్దన్‌రావు పాల్గొన్నారు.  కొత్తపల్లి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, రేకుర్తిలోని ప్యారడైస్‌ పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను అదనపు పాలనాధికారి గరిమా అగ్రవాల్‌ తనిఖీ చేశారు. ఆర్డీఓ ఆనంద్‌ కుమార్‌ పాల్గొన్నారు.


ఒకే గది..రెండు భాగాలు

మానకొండూర్‌ బాలుర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగానే విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో గంట పాటు ఉక్కపోతలో పరీక్షలు రాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకే గదిని రెండు భాగాలుగా విభజించి పరీక్షలు రాయించడం కొసమెరుపు.

-న్యూస్‌టుడే, మానకొండూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని