logo

నగరంలో ప్యారాచూట్ విన్యాసాలు

మానేరు తీరంలో ప్యారాచూట్ విన్యాసాలు అందుబాటులోకి రానున్నాయి. మూడు రోజులుగా కరీంనగర్‌ మానేరు జలాశయం మీదా ప్రయోగాత్మకంగా ఏయిర్‌ షో నిర్వహించారు. ప్యారాచూట్ విన్యాసాలకు ఈ ప్రాంతం అనువుగా ఉందా...

Published : 24 May 2022 04:30 IST

జూన్‌ 2న ప్రారంభించేందుకు ప్రయత్నాలు


ప్యారాచూట్ విన్యాసం చేస్తున్న సుకుమార్‌దాస్‌

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: మానేరు తీరంలో ప్యారాచూట్ విన్యాసాలు అందుబాటులోకి రానున్నాయి. మూడు రోజులుగా కరీంనగర్‌ మానేరు జలాశయం మీదా ప్రయోగాత్మకంగా ఏయిర్‌ షో నిర్వహించారు. ప్యారాచూట్ విన్యాసాలకు ఈ ప్రాంతం అనువుగా ఉందా...లేదా అని పరిశీలించిన పైలెట్ సుకుమార్‌దాస్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. మానేరు అందాలతో పాటు తీగలవంతెన, కరీంనగర్‌ పరిసరాలు ఆకాశం నుంచి తిలకించే విధంగా ఏయిర్‌ షోలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నగర సమీపంలోనే జలాశయం ఉండటంతో నీటిపై సాహస క్రీడలతో పాటు గాలిలో విన్యాసాలు నిర్వహించాలన్న ప్రధాన లక్ష్యంతో వర్టికల్‌ వరల్డ్‌ ఏరో స్పోర్ట్స్‌ అండ్‌ అడ్వెంచర్స్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2న సాహస క్రీడను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని