logo

రాష్ట్ర స్థాయి టీ-20 క్రికెట్‌ పోటీలు

కరీంనగర్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జోగినపల్లి జగన్‌మోహన్‌రావు స్మారక తెలంగాణ రాష్ట్రస్థాయి టీ-20 క్రికెట్‌ పోటీలను జూన్‌ 10 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు నాలుగు వేదికల్లో నిర్వహిస్తున్నట్లు

Published : 25 May 2022 02:39 IST

మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు ఆగమరావు

కరీంనగర్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే:Ÿ కరీంనగర్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జోగినపల్లి జగన్‌మోహన్‌రావు స్మారక తెలంగాణ రాష్ట్రస్థాయి టీ-20 క్రికెట్‌ పోటీలను జూన్‌ 10 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు నాలుగు వేదికల్లో నిర్వహిస్తున్నట్లు కరీంనగర్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.ఆగమరావు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం జిల్లా అసోసియేషన్‌ భవనంలో విలేకరులతో మాట్లాడారు.. టీడీఎల్‌ టీ-20 పేరుతో తెలంగాణలోని కరీంనగర్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నల్గొండ, ఉమ్మడి 8 జిల్లాలు పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఐపీఎల్‌ తరహలో అన్ని హంగులతో పోటీలు జరుగుతాయని చెప్పారు. విజేతకు రూ.2లక్షలు, రన్నర్‌కు రూ.లక్ష, తృతీయ బహుమతి రూ.50వేలు, నాలుగో బహుమతి రూ.25వేల నగదు అందిస్తున్నట్లు చెప్పారు. అన్ని జిల్లాల క్రీడాకారులతో పోటీలు కరీంనగర్‌లో ప్రారంభ వేదిక ఏర్పాటు చేశామన్నారు. మ్యాచ్‌ల సెమీఫైనల్‌, ఫైనల్‌ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారులందరికి ఉచితంగా జెర్సీలు, లాడ్జింగ్‌, భోజనం, రవాణా, జట్టుకు క్రికెట్‌ కిట్టు అందిస్తామన్నారు. 25 ఏళ్లలోపు క్రీడాకారులు పాల్గొనవచ్చని సూచించారు. జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శిగా దాదాపు 40ఏళ్లు పని చేసిన జగన్మోహన్‌రావు మృతి రాష్ట్ర, జిల్లా సంఘాలకు తీరని లోటని, ఆయన పేరున క్రికెట్‌ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సమావేశంలో జిల్లా సంఘం బాధ్యులు ఎన్‌.మురళీధర్‌రావు, పి.మనోహర్‌రావు, కె.రవీందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని