logo

హిందూ ఏక్తాయాత్ర నేడే

హనుమాన్‌ జయంతి సందర్భంగా ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ నేతృత్వంలో కరీంనగర్‌లో నేడు నిర్వహించే హిందూ ఏక్తాయాత్ర ఏర్పాట్లను మంగళవారం యాత్ర ప్రతినిధుల బృందంతో కలిసి

Published : 25 May 2022 02:39 IST

ఏర్పాట్లు పరిశీలించిన బృందం

శ్రీరాముడి విగ్రహాన్ని పరిశీలిస్తున్న ఎంపీ బండి సంజయ్‌

తెలంగాణచౌక్‌,(కరీంనగర్‌) న్యూస్‌టుడే: హనుమాన్‌ జయంతి సందర్భంగా ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ నేతృత్వంలో కరీంనగర్‌లో నేడు నిర్వహించే హిందూ ఏక్తాయాత్ర ఏర్పాట్లను మంగళవారం యాత్ర ప్రతినిధుల బృందంతో కలిసి భాజపా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హిందువుల ఐక్యత, సంఘటిత శక్తిని చాటాలనే లక్ష్యంతో 2016 నుంచి యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం సాయంత్రం 4-30 గంటలకు నగరంలోని వైశ్యభవన్‌ వద్ద యాత్ర ప్రారంభమై రాజీవ్‌చౌక్‌, టవర్‌సర్కిల్‌, ప్రకాశంగంజ్‌, శాస్త్రీరోడ్‌, భారత్‌టాకీస్‌, కమాన్‌చౌరస్తా, బస్టాండ్‌, తెలంగాణచౌక్‌, కోర్టు, మంచిర్యాలచౌరస్తా మీదుగా తిరిగి వైశ్యభవన్‌ చేరుకుంటుందని తెలిపారు. హిందూ బంధువులు పార్టీలకు అతీతంగా హాజరై ఏక్తాయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాజపా సీనియర్‌ నాయకులు బాస సత్యనారాయణరావు, జిల్లా ప్రధానకార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, నాయకులు బోయినిపల్లి ప్రవీణ్‌రావు, రాపర్తి ప్రసాద్‌, మాడుగుల ప్రవీణ్‌కుమార్‌, కటకం లోకేష్‌, దుబాల శ్రీనివాస్‌, పాదం శివరాజ్‌ పాల్గొన్నారు.

భారీగా తరలిరండి : ఎంపీ బండి సంజయ్‌
హిందూ ఏక్తాయాత్ర నేపథ్యంలో నగరంలో చౌరస్తాలను కాషాయ తోరణాలతో అలంకరించారు. యాత్ర ఊరేగింపు కోసం సిద్ధం చేసిన శ్రీరాముడు, హన్మంతుడి విగ్రహాలను ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ మహాశక్తి ఆలయ ఆవరణలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాత్రకు  భారీగా తరలివచ్చి హిందూ బంధువులంతా సంఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని