logo

అంజన్న కొండ... భక్త జనమే అంతా

కోరిన కోరికలు తీర్చే కొండగట్టు శ్రీహనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం సాయంత్రం సుదూర ప్రాంతాల నుంచి హనుమాన్‌

Published : 25 May 2022 02:39 IST

కొడిమ్యాల, మల్యాల, న్యూస్‌టుడే: కోరిన కోరికలు తీర్చే కొండగట్టు శ్రీహనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం సాయంత్రం సుదూర ప్రాంతాల నుంచి హనుమాన్‌ దీక్షాపరులు, భక్తులు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు కాషాయ శోభితంగా మారాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి సైతం దీక్షాపరులు, భక్తులు అంజన్న కొండకు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి దీక్షాపరులు ఎండ తీవ్రతను లెక్కచేయకుండా కాళ్లకు వస్త్రాలు చుట్టుకొని చేతి కర్రల సాయంతో ఆలయానికి నడుచుకుంటూ వస్తున్నారు. ఆలయానికి చేరుకున్న దీక్షాపరులు, భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు చేశారు. మాలవిరణమ చేసి తలనీలాలు సమర్పించుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. పలువురు మొక్కులు చెల్లించుకొని తిరుగు పయనమవుతున్నారు. ఉదయం సమయంలో భక్తులు, దీక్షాపరులు స్వామివారి దర్శనానికి పోటీపడగా మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సందడి కొంత తగ్గింది. సాయంత్రం కాలినడకన ఆలయానికి భారీగా చేరుకున్నారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు వేలాదిగా తరలివచ్చిన దీక్షాపరులు మాలవిరమణ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని