logo

బావిలో మునిగి ఇద్దరు గొర్రెల కాపరుల మృతి

గొర్రెలను కడుగుతూ ప్రమాదవశాత్తు బావిలో మునిగి ఇద్దరు గొర్రెల కాపరులు మృత్యువాత పడిన ఘటన మంగళవారం  కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేట గ్రామంలో చోటుచేసుకుంది. శ్రీరాములపేట గ్రామానికి చెందిన బొబ్బల

Published : 25 May 2022 02:39 IST

వీణవంక: గొర్రెలను కడుగుతూ ప్రమాదవశాత్తు బావిలో మునిగి ఇద్దరు గొర్రెల కాపరులు మృత్యువాత పడిన ఘటన మంగళవారం  కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేట గ్రామంలో చోటుచేసుకుంది. శ్రీరాములపేట గ్రామానికి చెందిన బొబ్బల కొండల్‌రెడ్డి (20),  జంగిలి రాములు (50)  బావనికుంట చెరువు సమీపాన గల బావిలో గొర్రెలను కడుగుతుండగా ప్రమాదవశాత్తు జారి కొండల్‌రెడ్డి నీట మునిగాడు. అతడిని కాపాడబోయి రాములు సైతం మునిగిపోయాడు. శ్రీనివాస్‌ అనే మరో  గొర్రెల కాపరి కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు తెలిపారు.

రెండు కుటుంబాల్లో విషాదం...
ఇద్దరూ  మృతి చెందడం ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కొన్ని సంవత్సరాలుగా కలిసి గొర్రెలు కాసుకునేవారు. జంగిలి రాములుకు భార్య సరోజన, కూతురు, కుమారుడు ఉన్నారు. మొదటి నుంచి  గొర్రెల పెంపకం వృత్తిపైనే జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుటుంబ పెద్ద దిక్కు అయిన రాములు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఆ కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. అలాగే బొబ్బల హాలియా, రాఘవరెడ్డి రెండో కుమారుడు కొండల్‌రెడ్డి కూడా గొర్రెలు కాస్తుండగా మృతి చెందడంతో విషాదం అలుముకుంది. కాగా కొండల్‌రెడ్డి అవివాహితుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని