ప్రేమ జంట ఆత్మహత్య
యువతికి పెళ్లయినా, యువకుడు రెండేళ్లు చిన్నవాడయినా కొనసాగించిన తీరు
రెండు కుటుంబాల్లో తీరని విషాదం
జగదేవపూర్, సిరిసిల్ల గ్రామీణం న్యూస్‌టుడే: ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు.. ఒకేచోట ఉద్యోగం చేస్తున్నారు.. ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. ఆమె పెళ్లయినా, రెండేళ్లు పెద్దయినా.. చాటుమాటుగా కలిసి తిరుగుతున్నారు. విషయం తెలిసి, కుటుంబంలో కలతలు పెరిగి, జీవితం శాశ్వతంగా పంచుకోలేమని భావించిన ప్రేమ జంట ఆత్మహత్మ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్‌నగర్‌కు చెందిన వెంకవ్వ, దశరథం దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు గతంలో అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నకుమారుడు నామ వేణుగోపాల్ (24) ఇదే పట్టణానికి చెందిన మచ్చ పూజ (26) ఇద్దరూ స్థానికంగా గోపాల్‌నగర్‌లోని ఓ ప్రైవేటు క్లినిక్ రిసెప్షన్‌లో పని చేస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రులు ఆమెకు నాలుగేళ్ల క్రితం మేనబావ అజయ్‌తో పెళ్లి చేశారు. భర్తతో ఆమె సఖ్యతగా ఉండటం లేదు. అవివాహితుడైన వేణుగోపాల్‌తో తరచుగా కలిసి తిరుగుతోంది. వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 15 నుంచి ఆమె ఇంటికి రోజుమాదిరి తిరిగి రాకపోవటంతో సిరిసిల్ల పోలీసు స్టేషన్‌లో భార్య అదృశ్యమైందని మే 16న భర్త ఫిర్యాదు చేశారు. విషయం తెలిసి, మనస్తాపానికి గురైన జంట ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయారు. మూడు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి అటవీ ప్రాంతంలోని ధర్మారం చౌరస్తా సమీపానికి బైక్‌పై వచ్చారు. ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. ఆయా కుటుంబాల్లో విషాదం నింపారు. జంట ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs IRL: ఐర్లాండ్‌తో పోరు.. 3, 4 స్థానాలు వాళ్లిద్దరివేనా?
-
Business News
GST compensation cess: జీఎస్టీ పరిహార సెస్సు మరో నాలుగేళ్లు
-
Movies News
Y Vijaya: ఆర్థికంగా నేనీ స్థాయిలో ఉన్నానంటే కారణం విజయశాంతినే: వై.విజయ
-
Politics News
Eknath Shinde: మా కుటుంబ సభ్యులకు ఏదైనా హాని జరిగితే.. ఠాక్రే, పవార్‌దే బాధ్యత
-
Politics News
Andhra News: ప్రభుత్వ మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్థాలు: తెదేపా
-
Sports News
IND vs IRL: పసికూనతో పోటీ.. టీమ్ఇండియా ఫేవరెటే అయినా..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం