logo

కనీస మద్దతు ధర కల్పనకు చట్టబద్ధత

రైతులు పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయడమే కాకుండా.. కనీస మద్దతు ధర కల్పించేలా చట్ట బద్దత కల్పిస్తామని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు డిక్లరేషన్‌లో భాగంగా మండలంలోని

Published : 25 May 2022 02:39 IST

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

బీర్‌పూర్‌, న్యూస్‌టుడే: రైతులు పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయడమే కాకుండా.. కనీస మద్దతు ధర కల్పించేలా చట్ట బద్దత కల్పిస్తామని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు డిక్లరేషన్‌లో భాగంగా మండలంలోని కొల్వాయిలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం 2004-2014 వరకు చేసిన కార్యక్రమాలనే మళ్లీ అమలు చేస్తామని ప్రజల్లోకి వెళుతున్నామని, ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా కల్లాల్లోనే సేకరణ చేసి రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. రైతు, రైతు కూలీలకు సమానంగా న్యాయం జరిగేలా రైతు బీమా అమలు చేస్తామని, ఉపాధిని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి కూలీలకు భద్రత కల్పించడమే కాకుండా అదనంగా ప్రతి ఏడాది రూ.12వేలు ప్రోత్సాహం కింద అందిస్తామన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరల పెరుగుదల లేకున్నా.. సుంకం పేరుతో వినియోగదారుల నడ్డి విరుస్తున్నారని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే  2014లో ఉన్న ధరలకే సిలిండర్‌, పెట్రో ఉత్పత్తులు ప్రజలకు అందిస్తామని హామీచ్చారు. భాజపా ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతుందని, అంబానీ, ఆదానీలాంటి వారిని ప్రోత్సహిస్తూ సామాన్య రైతులను విస్మరించిందని విమర్శించారు. సమావేశంలో ఎంపీపీ మాసర్థి రమేష్‌, జడ్పీటీసీ సభ్యురాలు పాత పద్మ, మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు బల్మూరి లక్ష్మన్‌రావు, సహకార సంఘ అధ్యక్షుడు పొల్సాని నవీన్‌రావు, శ్రీనివాస్‌, కో ఆప్షన్‌ సభ్యురాలు బీబా, రంగు లక్ష్మన్‌, ఆడెపు మల్లేశ్వరీ వివిధ గ్రామాల నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని