logo

మన ఊరు - మన బడిపై నిర్లక్ష్యం వద్దు

మన ఊరు మన బడి కార్యక్రమంపై నిర్లక్ష్యం చూపవద్దని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు. బుధవారం సాయంత్రం సంబంధిత అధికారులతో జూమ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశలో 274 పాఠశాలలను

Published : 26 May 2022 04:07 IST

ఎంఈఓలకు షోకాజ్‌ నోటీసులు


జూమ్‌ సమీక్షలో కలెక్టర్‌ రవి

జగిత్యాల, న్యూస్‌టుడే: మన ఊరు మన బడి కార్యక్రమంపై నిర్లక్ష్యం చూపవద్దని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు. బుధవారం సాయంత్రం సంబంధిత అధికారులతో జూమ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశలో 274 పాఠశాలలను ఎంపిక చేయగా 113 పాఠశాలల పనులకు అనుమతులిచ్చామన్నారు. అనుమతుల జారీ కోసం 105 ప్రతిపాదనలు సంబంధిత అధికారుల వద్ద పెండింగులో ఉన్నాయని, ప్రాజెక్టులు తయారు చేయడంలో జాప్యం చేయవద్దన్నారు. 72 పాఠశాలల్లో పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మండల ప్రత్యేక అధికారులు విద్యాశాఖ అధికారులు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని పనులు ప్రారంభించాలన్నారు. అవసరమైన ఇసుక వివరాలను సంబంధిత తహసీల్దార్లకు సమర్పించాలని, సమీప రీచ్‌ల నుంచి సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంపై విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ విషయమై ఆయా మండలాల ఎంఈఓలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని పనితీరు మార్చుకోకుంటే సస్పెండ్‌ చేస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, డీఈఓ డాక్టర్‌ బి. జగన్మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని