logo

మండలానికి రెండు క్రీడా ప్రాంగణాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి ప్రతి మండలంలో కనీసం రెండు గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక సంస్థల అదనపు

Published : 26 May 2022 04:07 IST

ఇందిరమ్మకాలనీలో స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, అధికారులు

తంగళ్లపల్లి, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి ప్రతి మండలంలో కనీసం రెండు గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌తో కలిసి తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలో క్రీడా ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలు వారు శారీరకంగా, మానసికోల్లాసంగా ఉండాలంటే ఇలాంటి క్రీడా ప్రాంగణాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఉపాధి హామీ నిధులతో వాలీబాల్‌ కోర్టు, ఖోఖో, కబడ్డీ, ఫుట్‌బాల్‌, ఇతర క్రీడలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.  ప్రాంగణం చుట్టూ బయోఫెన్సింగ్‌ చేయాలని ఆదేశించారు.

నెలాఖరులోగా ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ సర్వే పూర్తి: ఈ నెలాఖరులోగా ఈ- హెల్త్‌ ప్రొఫైల్‌ సర్వే పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో సర్వే జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిగిలిన ప్రజలకు సంబంధించి ఇంటింటా సర్వే చేపట్టారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీవో రవీందర్‌, తహసీల్దార్‌ సదానందం, ఎంపీడీవో లచ్చాలు, ఎంపీవో వెంకటేశ్వర్లు, సర్పంచి భైరి శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని