logo

వీధి వ్యాపారులకు చేయూత

వీధివ్యాపారులు కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో దయనీయ పరిస్థితులు ఎదుర్కొనగా.. ఇప్పటికీ కోలుకోవడం లేదు.. కొంతమేర వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు, జీవనోపాధిలో చేదోడుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీఎం స్వనిధి పథకం

Published : 26 May 2022 04:26 IST

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై నమోదు


నగరంలోని వీధివ్యాపారులు(దాచిన చిత్రం)

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సుభాష్‌నగర్‌: వీధివ్యాపారులు కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో దయనీయ పరిస్థితులు ఎదుర్కొనగా.. ఇప్పటికీ కోలుకోవడం లేదు.. కొంతమేర వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు, జీవనోపాధిలో చేదోడుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీఎం స్వనిధి పథకం ద్వారా రుణాలు మంజూరు చేసింది. అన్ని పుర, నగరపాలికల్లో లక్ష్యాన్ని విధించగా..రెండోవిడత రుణాలు అందేలా చర్యలు చేపట్టారు. వీధి వ్యాపారుల కుటుంబ స్థితి గతులు తెలుసుకోవడానికి స్వనిధి నుంచి సమృద్ధి వైపు మళ్లించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని మొదటగా తొమ్మిది నగరపాలక సంస్థలను ఎంపిక చేశారు. అందులో కరీంనగర్‌ ఒకటి కాగా, రెండోవిడతలో జగిత్యాల మున్సిపాలిటీ ఎంపికైనట్లు సమాచారం.

సంక్షేమ పథకాలు అమలు

కేంద్ర ప్రభుత్వం స్వనిధి కింద వీధివ్యాపారులకు రుణాలు ఇస్తుండగా వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఎనిమిది రకాల పథకాలు వీరికి అందించాల్సి ఉంటుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు బీమా వర్తింపజేయడం, ప్రతీ ఒక్కరికీ రేషన్‌కార్డు అందేలా చూడటం వంటి సంక్షేమ పథకాలు ప్రధానంగా ఉన్నాయి.

ఎనిమిదింటిలో 45,818 మంది అర్హులు

కేంద్రం అమలు చేస్తున్న ఎనిమిది రకాల పథకాలకు ఒక్క కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలోనే 45,818 మంది కుటుంబ సభ్యులు అర్హులుగా ఉన్నారు. వీరిలో 45,349 మంది దరఖాస్తు చేసుకోగా, 45,232 మంది కుటుంబ సభ్యులకు మంజూరయ్యాయి. పీఎం స్వనిధి కింద మొదటి విడతలో 9,845 మందికి, రెండో విడతలో 2,285 మంది వీధివ్యాపారులకు రుణాలు మంజూరయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని