logo

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కాలుష్య నియంత్రణ మండలి అధికారి పరిశీలన

రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌.) కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీరు(హైదరాబాద్‌) కుమార్‌ బుధవారం పరిశీలించారు. కర్మాగారం కాలుష్యంపై గురువారం హైదరాబాదులో కాలుష్య నియంత్రణ మండలి

Published : 26 May 2022 04:26 IST

ఫెర్టిలైజర్‌ సిటీ. న్యూస్‌టుడే : రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌.) కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీరు(హైదరాబాద్‌) కుమార్‌ బుధవారం పరిశీలించారు. కర్మాగారం కాలుష్యంపై గురువారం హైదరాబాదులో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలోనే ఆయన రామగుండంలో క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలుస్తోంది. గతంలో కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై పరిశీలనకు ప్రత్యేకంగా టాస్కుఫోర్సు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ పరిశీలన అనంతరం ఎరువుల కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకే హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా అధికారి రామగుండంలో పరిశీలించినట్లు తెలిసింది. వీర్లపల్లి వాసులు శబ్ద, వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారంటూ స్థానిక అధికారులు నివేదించడంతో పాటు స్థానికంగా ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కర్మాగారంలో కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు పరిశీలించగా కొన్ని విభాగాల్లో నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న కాలుష్య నియంత్రణ మండలి సమావేశంలో ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని