జోనల్ విధానంతో స్థానికులకే ఉద్యోగాలు
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
వారధి స్టడీ సర్కిల్లో మాట్లాడుతున్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, పక్కన మేయర్ సునీల్రావ్యు
రాంపూర్(కరీంనగర్), న్యూస్‌టుడే: స్థానికులకే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక కృషి భవన్లో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వారధి స్టడీ సర్కిల్‌తో పాటు ఎస్సీ స్టడీ సర్కిళ్లను ఆయన బుధవారం సందర్శించి బోధన, ఇతర వసతి సదుపాయాలపై యువతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా తమ సొంత ఖర్చులతో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో గత ఏడాది మాదిరిగానే ప్రస్తుతం 150 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత బోధన, శిక్షణ తరగతులను ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగ యువత కష్టపడి ప్రభుత్వ కొలవులను సొంతం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగావకాశాల్లో ఎలాంటి పైరవీలకు తావుండొద్దనే సంకల్పంతోనే ఇంటర్వ్యూ పద్ధతి తొలగించారని తెలిపారు. కావాల్సిన వసతులను కల్పించాలని మేయర్, డెయిరీ ఛైర్మన్లకు సూచించారు. మేయర్ వై.సునీల్‌రావు మాట్లాడుతూ.. వినోద్‌కుమార్ ఆదేశాల మేరకు రూ.5 భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు అందిస్తామని డెయిరీ ఛైర్మన్ సి.హెచ్.రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరాస నాయకులు జక్కుల నాగరాజు, ప్రాథమిక సహకార సంఘం ఛైర్మన్లు వి.వెంకటేశ్వర్రావు, రాజనర్సింహారావు పాల్గొన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్లోని అభ్యర్థులు వినోద్‌కుమార్‌ను కలిసి ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు స్టడీ సర్కిల్లో మరో రెండు నెలల పాటు అవకాశం కల్పించాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Senegal: సమద్రంలో బోటు బోల్తా.. 13 మంది మృతి, 40మంది గల్లంతు!
-
India News
Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
-
India News
Jammu: జమ్మూలో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Sports News
Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు సిద్ధమే: హనుమ విహారి
-
Business News
బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
-
Crime News
Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Mahesh babu: బిల్ గేట్స్‌తో మహేశ్‌బాబు.. పిక్ వైరల్.. ఎక్కడ కలిశారంటే?
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
- Viral Video: గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం