logo

వచ్చే నెల ఒకటి నుంచి ప్లాస్టిక్‌ నిషేధం

జులై 1 నుంచి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌ కవర్లు, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వస్తువులన్నీ నిషేధిస్తున్నట్లు నగరపాలక కమిషనర్‌ సేవా ఇస్లావత్‌ అన్నారు. గురువారం నగరపాలక కార్యాలయంలో హోల్‌సెల్, రిటేల్‌ వ్యాపారులతో సమావేశం

Published : 24 Jun 2022 04:25 IST

నగరపాలక కమిషనర్‌ సేవా ఇస్లావత్‌

మాట్లాడుతున్న కమిషనర్‌ సేవా ఇస్లావత్‌ 

కార్పొరేషన్, న్యూస్‌టుడే: జులై 1 నుంచి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్‌ కవర్లు, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వస్తువులన్నీ నిషేధిస్తున్నట్లు నగరపాలక కమిషనర్‌ సేవా ఇస్లావత్‌ అన్నారు. గురువారం నగరపాలక కార్యాలయంలో హోల్‌సెల్, రిటేల్‌ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాల ప్రకారం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు వాడినా, తయారు చేసిన, అమ్మకాలు చేసినా, నిల్వ ఉంచిన చట్టపరంగా బాధ్యులవుతారని వివరించారు. మొదటిసారి రూ.2,500, రెండోసారి రూ.5వేలు, మూడోసారి రూ.50వేల జరిమానా విధించడంతో పాటు ట్రేడ్‌ లైసెన్స్‌ రద్దు చేయడం జరుగుతుందన్నారు. దీనికోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ బృందం ఏర్పాటు చేశామని, నిరంతరంగా తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్లాస్టిక్‌కు బదులుగా బట్ట, కాగితపు సంచులు, వస్తువులు వాడాలని కోరారు. అనంతరం గోడప్రతులను ఆవిష్కరించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ త్రియంబకేశ్వర్‌రావు, పారిశుద్ధ్య పర్యవేక్షకుడు రాజమనోహర్, పర్యావరణ ఇంజినీరు స్వామి, ఇన్‌స్పెక్టర్లు, వ్యాపారులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని