logo
Published : 24 Jun 2022 04:25 IST

పట్టణ ప్రగతి నిధుల గలగల

జూన్‌ మాసానికి రూ.3.93కోట్లు విడుదల

ఈనాడు, కరీంనగర్‌

పట్టణాల రూపురేఖల్ని మార్చేలా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతికి సంబంధించిన నిధుల్ని గురువారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల మూడో తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రెండు కార్పొరేషన్‌లతోపాటు 14 పురపాలికల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాల్ని నిర్వహించారు. ఇందులో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి జనాభాను బట్టి అవసరమైన నిధుల్ని సర్కారు అందిస్తోంది. జూన్‌ మాసానికి సంబంధించిన నిధులు రూ.3.93కోట్లను ఆయా బల్దియా ఖజానాలకు చేర్చబోతోంది.   2020 ఫిబ్రవరి 24వ తేదీన మొట్టమొదటి సారిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మౌలిక వసతుల కల్పన సహా పలు రకాల పనుల్ని చేపట్టారు. ఈ నెలలో నాలుగో విడత కార్యక్రమాన్ని అన్ని చోట్ల పక్కాగానే కొనసాగించారు. ఈ సందర్భంగా పలు రకాల అభివృద్ధిని అందించాలని ఆకాంక్షిస్తున్న బల్దియాలకు తాజాగా విడుదలైన నిధులు ఉపయోగకరంగా మారనున్నాయి. ప్రతి నెల ఇదే తరహాలో అన్ని పుర, నగరపాలికలకు ఈ నిధులు అందనున్నాయి. 

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని