logo

ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటోంది

చిరువ్యాపారుల జీవనోపాధికి నాలుగు చోట్ల వెండింగ్‌ జోన్లు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం నగరంలోని 43వ డివిజన్‌ సవారన్‌వీధిలో కొత్తగా నిర్మిస్తున్న

Published : 27 Jun 2022 04:28 IST

రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌

పనులు పరిశీలిస్తున్న మంత్రి కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: చిరువ్యాపారుల జీవనోపాధికి నాలుగు చోట్ల వెండింగ్‌ జోన్లు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం నగరంలోని 43వ డివిజన్‌ సవారన్‌వీధిలో కొత్తగా నిర్మిస్తున్న వెండింగ్‌ జోన్‌ పనులను మేయర్‌ వై.సునీల్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటుందన్నారు. నూతనంగా నిర్మిస్తున్న వెండింగ్‌ జోన్‌లో 50మంది వ్యాపారులకు సరిపడా షెట్టర్‌తో కూడిన దుకాణాలను నగరపాలిక నిర్మిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సరిళ్ల ప్రసాద్‌, ఐలేందర్‌యాదవ్‌, దిండిగాల మహేశ్‌, నాయకులు ఉన్నారు.

దళితబంధు మొదటి విడతలో ఎంపికైన 44వ డివిజన్‌కు చెందిన మద్దూరి మాధవి శ్రీధర్‌కు మంత్రి గంగుల కమలాకర్‌ చేతుల మీదుగా వాహనం అందించారు. ఆదివారం డివిజన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రితో పాటు మేయర్‌ వై.సునీల్‌రావు, కార్పొరేటర్లు మెండి శ్రీలత, చంద్రశేఖర్‌, సరిళ్ల ప్రసాద్‌, నాయకులు చల్లా హరిశంకర్‌ పాల్గొన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని