logo

రజనిశ్రీ తొలి సాహిత్య పురస్కార ప్రదానం

జాతీయ సాహిత్య పరిషత్‌ ఆధ్వర్యంలో రజనిశ్రీ రాష్ట్ర స్థాయి తొలి సాహిత్య పురస్కారం ‘అతడే అలిగిన్నాడు’ గ్రంథ రచయిత నూటెంకి రవీంద్రకు ప్రదానం చేశారు. ఆదివారం స్థానిక ఐఎంఏ హాలులో జరిగిన ఈ

Published : 27 Jun 2022 04:28 IST

రచయిత నూటెంకి రవీంద్రకు రజనిశ్రీ పురస్కారం అందజేస్తున్న జిల్లా అదనపు పాలనాధికారి జీవీ.శ్యాంప్రసాద్‌ లాల్‌, కవులు

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: జాతీయ సాహిత్య పరిషత్‌ ఆధ్వర్యంలో రజనిశ్రీ రాష్ట్ర స్థాయి తొలి సాహిత్య పురస్కారం ‘అతడే అలిగిన్నాడు’ గ్రంథ రచయిత నూటెంకి రవీంద్రకు ప్రదానం చేశారు. ఆదివారం స్థానిక ఐఎంఏ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సాహితీ గౌతమి అధ్యక్షుడు డాక్టర్‌ గండ్ర లక్ష్మణ్‌రావు హాజరై మాట్లాడుతూ.. కవిత్వంలో లోక పరిశీలన ఉన్నప్పుడే చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. నూటెంకి రవీంద్ర సాహిత్య గొప్పదనాన్ని వివరించారు. రజనీశ్రీ కుమారుడు, జిల్లా అదనపు పాలనాధికారి జీవీ.శ్యాంప్రసాద్‌లాల్‌ మాట్లాడుతూ.. ఎందరో కళాకారులకు ఆదర్శంగా నిలిచిన నాన్న పేరు మీద పురస్కారం అందజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని,  ప్రతి సంవత్సరం అందజేస్తామన్నారు. రజనిశ్రీ కళా సేవ, జీవిత విశేషాలతో డాక్యుమెంటరీ రూపొందించిన నంది శ్రీనివాస్‌, ఆర్యభట్ట యానిమేషన్స్‌ గౌతమ్‌, కె.బి.శర్మలను అభినందించారు. పురస్కార గ్రహీత నూటెంక రవీంద్ర మాట్లాడుతూ.. తాను మట్టి మనిషినని.. మట్టి వాసన కవిత్వం ద్వారా వ్యక్తీకరించానన్నారు. జాతీయ సాహిత్య పరిషత్‌ అధ్యక్షుడు గాజుల రవీందర్‌ అధ్యక్షత వహించగా కవి, విమర్శకులు దాస్యం సేనాధిపతి గ్రంథ పరిచయం చేశారు. కార్యక్రమంలో గాజుల సత్యవతి రజనిశ్రీ, పొన్నం రవిచంద్ర, నంది శ్రీనివాస్‌, గంగాధర్‌, శ్రీకర్‌, శ్రీనివాస్‌, అనంతాచార్య, వేణుశ్రీ, ప్రమోద్‌కుమార్‌, గజేందర్‌రెడ్డి, బి.వి.ఎన్‌.స్వామి, కె.రామకృష్ణ, అన్నవరం శ్రీనివాస్‌, ఎ.పద్మశ్రీ, వెంకటేశ్వర్లు, కందుకూరి అంజయ్య, అదనపు కలెక్టర్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు