logo

ఆలోచన అదిరింది... సాగు భారం తగ్గింది

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్‌ మండలం మారుపాకకు చెందిన నాంపల్లి శంకర్‌ తనకున్న రెండు ఎకరాలతో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిసాగు చేస్తున్నారు. పంటను సాగు చేయడానికి,

Published : 27 Jun 2022 04:28 IST

న్యూస్‌టుడే, కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్‌ మండలం మారుపాకకు చెందిన నాంపల్లి శంకర్‌ తనకున్న రెండు ఎకరాలతో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిసాగు చేస్తున్నారు. పంటను సాగు చేయడానికి, దున్నడానికి కాడెద్దులు కొనుగోలుకు ఆర్థిక స్థోమత లేదు. యూట్యాబ్‌లో చూసి మూలనపడ్డ సైకిల్‌ తీసుకుని వెనక చక్రం కట్‌ చేయించారు. వెనక చక్రం ఉండే ప్రదేశంలో పత్తిలో దున్నడానికి గుంటకను బిగించారు. సైకిల్‌, సాగు సామగ్రికి రూ.2 వేలు వెచ్చించి దీనిని తయారు చేశారు. రోజుకు ఎకరం పత్తి పొలంలో దున్నుతున్నారు. ఫలితంగా పెట్టుబడి భారం తగ్గింది. మారుపాక సరిహద్దులోని కోనరావుపేట మండలం సుద్దాల శివారులో పత్తి చేనులో సైకిల్‌ సహాయంతో పత్తి చేనులో దున్నుతున్న రైతు శంకర్‌ చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ తన కెమెరాలో బంధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని