logo
Published : 27 Jun 2022 04:28 IST

ఉద్యాన పంటలు... రాయితీ అవకాశాలు

జె.ప్రతాప్‌సింగ్‌ జిల్లా ఉద్యాన శాఖాధికారి జగిత్యాల
జగిత్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే

గిత్యాల జిల్లాలో వానాకాలం పంటలసాగు ఊపందుకోగా జిల్లాలో 33 వేల ఎకరాల్లో మామిడి, 33 వేల ఎకరాల్లో పసుపు, తొమ్మిది వేల ఎకరాల్లో కూరగాయలు, మిరప, పూలు, ఇతర పండ్లతోటలు సాగులో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యాన శాఖాపరంగా రైతులకు అందుబాటులోని రాయితీలను గూర్చి జగిత్యాల జిల్లా అధికారి జె.ప్రతాప్‌సింగ్‌ ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి ద్వారా వివరించారు.

ఇతర రాయితీలు: నూతనంగా మామిడి, అరటి, బొప్పాయి, జామ, నిమ్మ పండ్లతోటలను నాటుకునేవారికి రాయితీ ఉంది. తోటల్లో అమర్చుకున్న మల్చింగ్‌కు రాయితీ డబ్బులు వస్తాయి. మామిడి, అరటి, జామ, నిమ్మ బొప్పాయితో పాటుగా మల్బరీకి కూడా 74 హెక్టార్లలో బిందుసేద్య పరికరాలకు రాయితీ వస్తుంది. రైతులు తోటల్లో నిర్మించుకునే చిన్నతరహా ఫాంపాండ్స్‌కు రాయితీ వర్తిస్తుంది. గత సంవత్సరాల్లో నాటుకున్న పండ్లతోటలకు రెండవ, మూడవ సంవత్సరానికిగాను నిర్వహణ నిధులు వస్తాయి. ఇంకనూ ఎంఐడీహెచ్‌, ఆర్‌కేవీవై, ఇతర కేంద్రరాష్ట్ర ప్రభుత్వ పథకాల నిధులకు గాను ప్రతిపాదనలను పంపించాము. జిల్లాకు రాయితీపై కూరగాయల నారును ఇవ్వనుండగా కూరగాయల నారును పొందగోరువారు ఉద్యానశాఖ అధికారికి వివరాలిచ్చి సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ నుంచి నారు తెచ్చుకోవాలి.

సాగుకు సహకారం: షేడ్‌నెట్, మామిడి తోటల పునరుద్ధరణ, పాలీహౌజులు, పట్టుశాఖ ద్వారా అందించే రాయితీలకు నివేదించాము. బ్యాంకులనుంచి పంటరుణం తీసుకునే రైతులు తప్పనిసరిగా పత్రాలపై వారుపండించే పంటల వివరాలను నమోదు చేయించుకోవాలి. నూతనంగా పండ్లతోటలు సాగుచేసేవారు ఉద్యానశాఖ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి. ఉద్యానశాఖ రాయితీలు, సాగుసలహాలకు జగిత్యాల అర్బన్‌, జగిత్యాల రూరల్‌, మల్యాల, కొడిమ్యాల, రాయికల్‌, సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాల రైతులు జగిత్యాల డివిజన్‌ అధికారి, మేడిపల్లి, కోరుట్ల, కథలాపూర్‌, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ మండలాల రైతులు కోరుట్ల ఉద్యానశాఖ అధికారి జి.శ్యాంప్రసాద్‌ను 7780239329 నెంబరులో, ధర్మపురి, బుగ్గారం, వెల్గటూరు, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల రైతులు ధర్మపురి డివిజన్‌ అధికారి జి.దేవప్రసాద్‌ను 7013681010 నెంబరులో సంప్రదించవచ్చు.

తొలిసారి ఆయిల్‌పామ్‌: జిల్లాలోని 18 మండలాల్లో ఈ సంవత్సరం తొలిసారిగా ఆయిల్‌పామ్‌ను 9-11 వేల ఎకరాల్లో నాటేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు మొక్కలతో పాటుగా బిందుసేద్య పరికరాలను రాయితీపై అందజేస్తాం. జిల్లాలో ప్రైవేటు కంపనీ ఆయిల్‌పామ్‌ నర్సరీని ఏర్పాటు చేయగా ఇప్పటికే మొక్కలు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజుల తరువాత రైతులనుంచి దరఖాస్తులను తీసుకొని ఫిబ్రవరి నుంచి మొక్కలను నాటేలా చర్యలు తీసుకుంటున్నాము.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts